భారత షూటర్లకు అవమానం

17 Apr, 2015 01:47 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచకప్ షూటింగ్‌లో పాల్గొన్న భారత షూటర్లు బ్యాంకాక్ విమానాశ్రయంలో అవమానకర పరిస్థితి ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి ముంబైకి రావాల్సిన హీనా సిద్ధూ, అంజలీ భగవత్ తమ దగ్గరున్న ఆయుధాలకు సరైన పత్రాలు చూపని కారణంగా అధికారులు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. అయితే వీరి ప్రవర్తనపై షూటర్లు అభ్యంతరం తెలిపారు. తమ దగ్గర అన్ని అనుమతులున్నా అడ్డుకున్నారని ఆరోపించారు.

‘మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా కూడా బ్యాంకాక్‌లోని జెట్ ఎయిర్‌వేస్ సెక్యూరిటీ మేనేజర్ మమ్మల్ని విమానంలో ఎక్కకుండా అడ్డుకున్నాడు. అతడు దీన్ని ఇగో సమస్యగా తీసుకున్నాడు. డీజీసీఏ అనుమతి, కస్టమ్స్ క్లియరెన్స్ లేఖ చూపినా పట్టించుకోలేదు’ అని హీనా సిద్ధూ తెలిపింది. అనంతరం జాతీయ రైఫిల్స్ సంఘం జోక్యంతో వారిద్దరు ఎయిరిండియా విమానంలో తిరిగి స్వదేశానికి చేరారు.

మరిన్ని వార్తలు