మీరాబాయి చానుకు స్వర్ణం

8 Feb, 2019 02:03 IST|Sakshi

న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత భారత వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ఘనమైన ప్రదర్శన నమోదు చేసింది. థాయిలాండ్‌లో జరిగిన ఈజీఏటీ కప్‌లో ఆమె 49 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. మాజీ ప్రపంచ చాంపియన్‌ కూడా అయిన చాను వెన్ను నొప్పితో గత ఏడాదిలో దాదాపు ఆరు నెలలు ఆటకు దూరమైంది. తాజా ఈవెంట్‌లో ఆమె స్నాచ్‌లో 82 కేజీలు, క్లీన్‌ అండ్‌లో జర్క్‌లో 110 కేజీలు కలిపి మొత్తం 192 కిలోల బరువెత్తింది. ఈజీఏటీ కప్‌ను ద్వితీయ శ్రేణి ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీగా వ్యవహరిస్తారు. ఇక్కడ సాధించే పాయింట్లను వరల్డ్‌ ర్యాంకింగ్‌ కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఫలితంగా 2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించే క్రమంలో ఈ విజయం చానుకు ఎంతో మేలు చేస్తుంది.   

మరిన్ని వార్తలు