ఆసీస్‌ను నిలువరించిన భారత్‌

19 Aug, 2019 06:16 IST|Sakshi

టోక్యో: ఒలింపిక్‌ టెస్ట్‌ ఈవెంట్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’గా ముగించింది. భారత్‌ తరఫున వందన కటారియా (36వ నిమిషంలో), గుర్జీత్‌ కౌర్‌ (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ఆస్ట్రేలియా జట్టుకు కైట్లిన్‌ నోబ్స్‌ (14వ నిమిషంలో), గ్రేస్‌ స్టీవార్ట్‌ (43వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. ఇదే టోర్నీలో భారత పురుషుల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1–2తో ఓడిపోయింది. రెండో నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ చేసిన గోల్‌తో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కివీస్‌ ప్లేయర్‌ జేకబ్‌ స్మిత్‌ 47వ నిమిషంలో గోల్‌ చేసి స్కోరును సమం చేశాడు. చివరి నిమిషంలో స్యామ్‌ లేన్‌ గోల్‌ సాధించి న్యూజిలాండ్‌ విజయాన్ని ఖాయం చేశాడు.

మరిన్ని వార్తలు