భారత్‌దే తొలి వన్డే

16 Feb, 2016 00:08 IST|Sakshi

శ్రీలంక మహిళలతో మ్యాచ్
రాంచీ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు విజయంతో ఆరంభించింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (4/22) ప్రత్యర్థిని బెంబేలెత్తించడంతో సోమవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 107 పరుగుల భారీ తేడాతో గెలిచింది. రెండో వన్డే రేపు (బుధవారం) ఇదే వేదికపై జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 245 పరుగులు చేసింది. స్మృతి మందానా (81 బంతుల్లో 55; 8 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (61 బంతుల్లో 50; 4 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (74 బంతుల్లో 49; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్ ఆడింది.

ప్రబోధని, సిరివర్ధనెలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక 45.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వీరక్కోడి (113 బంతుల్లో 69; 7 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 122/3 స్కోరుతో శ్రీలంక పటిష్ట స్థితిలో కనిపించినా... పూనమ్, దీప్తి (2/20), రాజేశ్వరి (2/31) ధాటికి ఆ జట్టు చివరి ఏడు వికెట్లను 16 పరుగులకే కోల్పోయింది.

>
మరిన్ని వార్తలు