అమ్మాయిలూ...  ఇదొక్కటైనా?

10 Feb, 2019 02:03 IST|Sakshi

హామిల్టన్‌: ఆతిథ్య న్యూజిలాండ్‌ చేతిలో వైట్‌వాష్‌ తప్పించుకోవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో భారత మహిళల క్రికెట్‌ జట్టు నేడు చివరి టి20 బరిలో దిగుతోంది. బ్యాటింగ్‌ వైఫల్యమే రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టును దెబ్బతీసినందున ఈసారైనా ఆ విభాగంలో మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. టాపార్డర్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లపై జట్టు అతిగా ఆధారపడుతోంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ పర్యటనలో స్థాయికి తగ్గ ఇన్నింగ్సే ఆడలేదు.

త్వరలో టి20లకు వీడ్కోలు పలకనున్న వెటరన్‌ మిథాలీరాజ్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌ మెరుగైన స్కోరు చేస్తేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. మరోవైపు ముందుగా బ్యాటింగ్‌కు దిగినా, బౌలింగ్‌ చేసినా ప్రత్యర్థిని కీలక సమయాల్లో దెబ్బకొడుతూ సొంతగడ్డపై న్యూజిలాండ్‌ సమష్టిగా రాణిస్తోంది. భారత్‌... ఈ మ్యాచ్‌లో కలసి కట్టుగా ఆడితేనే గెలుపు తీరం చేరుతుంది.

►ఉదయం గం. 8.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా