భారత మహిళలదే సిరీస్‌ 

23 May, 2019 00:39 IST|Sakshi

రెండో మ్యాచ్‌లోనూ కొరియాపై 2–1తో విజయం  

జిన్‌చియోన్‌ (కొరియా): ఈ సీజన్‌లో భారత మహిళల హాకీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇటీవల స్పెయిన్, మలేసియా పర్యటనల్లో ఆకట్టుకున్న టీమిండియా దక్షిణ కొరియాతో సిరీస్‌లోనూ తమ ఆధిపత్యం చాటుకుంది. కొరియాతో బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 2–1తో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లోనూ భారత్‌ 2–1తో గెలిచిన సంగతి తెలిసిందే.

రెండో మ్యాచ్‌లో భారత్‌కు కొరియా నుంచి గట్టిపోటీ లభించింది. రెండు జట్లు దూకుడుగా ఆడటంతో తొలి క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్‌లు వచ్చాయి. అయితే ఇరు జట్లు ఈ అవకాశాలను వృథా చేసుకున్నాయి. అనంతరం 19వ నిమిషంలో లీ సెయుంగ్‌జు గోల్‌తో కొరియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లో భారత క్రీడాకారిణులు సమన్వయంతో ఆడుతూ కొరియాపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 37వ నిమిషంలో కెప్టెన్‌ రాణి రాంపాల్‌ గోల్‌ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. 50వ నిమిషంలో నవ్‌జ్యోత్‌ కౌర్‌ గోల్‌తో భారత ఆధిక్యం 2–1కి పెరిగింది. సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్‌ శుక్రవారం జరుగుతుంది.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కష్టాల్లో ఇంగ్లండ్‌..

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌: ఓపెనర్లు అదరగొట్టినా..

ఓటమికి రషీద్‌ ఖానే కారణం: అఫ్గాన్‌ సారథి

భువీ ఈజ్‌ బ్యాక్‌

83.. భారత క్రికెట్‌లో ఒక మరుపురాని జ్ఞాపకం

బ్రియాన్‌ లారాకు అస్వస్థత

ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

‘సచిన్‌ కంటే ధోనీనే ఎన్నో రెట్లు గొప్ప ఆటగాడు’

భారత్‌ను ఓడిస్తాం : షకీబ్‌

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పాక్‌ కోచ్‌

అదిరిన భారత బాక్సర్ల పంచ్‌

రామ్‌కుమార్‌ శుభారంభం

సమఉజ్జీల సమరం

బంగ్లా పైపైకి...

తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా..

వరల్డ్‌కప్‌ నుంచి ఆండ్రీ రసెల్‌ ఔట్‌

షైనీకి పిలుపు.. ఇంగ్లండ్‌కు పయనం

అఫ్గాన్‌ లక్ష్యం 263

అయ్యో.. ఇంగ్లండ్‌

‘కొంతమంది నోళ్లు మూయించాం’

‘ప్రపంచ క్రికెట్‌లో నయా ధోని’

అతని కోసం ప్రణాళిక సిద్ధం చేశాం: చహల్‌

అఫ్గాన్‌కు ఎక్కువ సీన్‌ ఇచ్చారు: మాజీ క్రికెటర్‌

అంపైర్‌కే అర్థం కాలేదు..!

బంగ్లాదేశ్‌ను నిలువరించేనా?

మేం మునిగాం.. బంగ్లానూ ముంచుతాం

టీఎఫ్‌ఏ అధ్యక్షునిగా మొహమ్మద్‌ అలీ రఫత్‌

రాష్ట్ర స్విమ్మింగ్‌ జట్ల ప్రకటన

పాక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌!

అంతా ఐపీఎలే చేసింది : డూప్లెసిస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఎంట్రీపై లాస్య ఏమన్నారంటే..

శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!