ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ బెర్త్‌ సొంతం

23 Jun, 2019 04:01 IST|Sakshi

హిరోషిమా: ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీకి భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించింది. హిరోషిమాలో జరుగుతోన్న మహిళల హాకీ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీలో చిలీపై  విజయం సాధించి క్వాలిఫయర్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 4–2 గోల్స్‌ తేడాతో విజ యం సాధించింది. భారత్‌ తరపున గుర్జిత్‌ కౌర్‌(22, 37వ నిమిషంలో), నవ్‌నీత్‌ కౌర్‌(31వ నిమిషంలో), రాణి రాంపాల్‌(57వ నిమిషంలో)లు గోల్స్‌ సాధించగా... చిలీ తరపున కరోలినా గార్సియా(18వ నిమి షంలో), మాన్యుల ఉరోజ్‌ (43వ నిమిషంలో) చెరో గోల్‌ చేశారు.

ఆట 18వ నిమిషంలో కరోలినా గార్సియా గోల్‌తో చిలీ ఖాతా తెరిచింది. అయితే షాక్‌ నుంచి త్వరగానే తేరుకున్న భారత్‌ 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌ పోస్ట్‌లోకి నెట్టి గుర్జిత్‌ కౌర్‌ స్కోరును సమం చేసింది. తర్వాత మరింత దూకుడును పెంచిన భారత్‌ ప్రత్యర్థి గోల్‌ పోస్టుపైకి దాడులను ముమ్మరం చేసింది. ఆట 31వ నిమిషంలో ఫీల్డ్‌ గోల్‌ చేసిన నవ్‌నీత్‌ కౌర్‌ భారత్‌కు 2–1 ఆధిక్యాన్నిచ్చింది. 37వ నిమిషంలో మరో గోల్‌ సాధించిన గుర్జీత్‌ కౌర్‌ భారత్‌ స్కోర్‌ను 3–1కు తీసుకెళ్లింది.

చిలీ తరపున మాన్యుల ఉరోజ్‌ 43వ నిమిషంలో గోల్‌ సాధించి భారత్‌ ఆధిక్యాన్ని 3–2కు తగ్గించింది. 4వ క్వార్టర్‌లో భారత్‌ తరపున గోల్‌ సాధించిన రాణి రాంపాల్‌ భారత విజయాన్ని ఖాయం చేసింది. మ్యాచ్‌లో భారత్‌ 2 గ్రీన్‌ కార్డులను పొందగా, చిలీ 1 గ్రీన్‌ కార్డును పొందింది. మరో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌ 3–1తో   పెనాల్టీ షూటౌట్‌లో రష్యాపై విజయం సాధించి ఫైనల్‌లో ప్రవేశించింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్కో గోల్‌ చేయడంతో షూటౌట్‌ అనివార్యమైంది. ఆదివారం భారత్, జపాన్‌ల మధ్య టైటిల్‌ పోరు జరగనుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

స్టోక్స్‌ ఆ పరుగులు వద్దన్నాడట!

కపిల్‌ త్రయం చేతిలో... హెడ్‌ కోచ్‌ ఎంపిక బాధ్యత!

అబొజర్‌కు తెలుగు టైటాన్స్‌ పగ్గాలు

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌: రాయ్‌ తొలిసారి

యుముంబా కెప్టెన్‌ ఫజల్‌ అట్రాచలీ

పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక

‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’

కూతేస్తే.. కేకలే

‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’

ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

కోచ్‌ల కోసం తొందరెందుకు?

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

పంత్‌ కోసం ధోనీ చేయబోతుందిదే!

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

గాయం బెడద భయం గొల్పుతోంది

ఆఖరి స్థానంతో సరి

మళ్లీ గెలిచిన గేల్‌

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

సిక్కి రెడ్డి జంటకు మిశ్రమ ఫలితాలు

సచిన్‌ ప్రపంచకప్‌ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు

ఫైనల్లో పరాజితులు లేరు 

60 ఏళ్లకు మించరాదు! 

టీమిండియా కోచ్‌కు కొత్త నిబంధనలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..