డ్రా దిశగా తొలి టెస్టు

20 Nov, 2017 11:43 IST|Sakshi

కోల్ కతా:భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. చివరిరోజు ఆటలో భాగంగా భారత్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో లంచ్ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(41 బ్యాటింగ్), అశ్విన్ (0 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 129 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇది ఆఖరి రోజు ఆట కావడంతో మ్యాచ్ ఫలితం రావడం ఇక కష్టమే.

171/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆఖరి రోజు ఆట ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాకిచ్చాడు లక్మల్.తొలుత కేఎల్ రాహుల్(79;125 బంతుల్లో8 ఫోర్లు) ను అవుట్ చేసిన లక్మల్..కాసేపటికి చతేశ్వర పుజారా(22), అజింక్యా రహానే(0)లను వరసు బంతుల్లో అవుట్ చేశాడు. 21 పరుగుల వ్యవధిలో ముగ్గరు టాపార్డర్ ఆటగాళ్లను లక్మల్ అవుట్ చేసి లంక శిబిరంలో ఆనందం నింపాడు.  ఇక రవీంద్ర జడేజా(9) వికెట్ ను పెరీరా సాధించాడు.
 

మరిన్ని వార్తలు