కోహ్లి కెప్టెన్సీలో ‘చెత్త’ ఇన్నింగ్స్‌!

22 Feb, 2020 11:57 IST|Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత టీమిండియాకు పెద్దగా కలిసి రావడం లేదు. వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన విరాట్‌ గ్యాంగ్‌.. తొలి టెస్టులో సైతం పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటై చెత్త గణాంకాలను నమోదు చేసింది. 122/5 ఓవరనైట్‌ స్కోర్‌తో శనివారం రెండో రోజు ఇన్నింగ్‌ ఆరంభించిన కోహ్లి సేన మరో 43 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది.  అయితే ఇది కోహ్లి కెప్టెన్సీలో చెత్త ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నమోదైంది. విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు అత్యల్ప తొలి ఇన్నింగ్స్‌ స్కోర్ల పరంగా రెండోదిగా నిలిచింది. 2018లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌటైతే, ఆ తర్వాత తాజా మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు రెండో స్థానాన్ని ఆక్రమించింది. (ఇక్కడ చదవండి: ఇంకో 43 కొట్టారు అంతే..)

ఇక కోహ్లి కెప్టెన్సీలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లేకుండా భారత ఆడిన టెస్టుల సంఖ్య 14 కాగా, అందులో రెండు విజయాలనే సాధించింది. 2017లో బెంగళూరులో ఆసీస్‌తో జరిగిన టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించకపోయినా మ్యాచ్‌ను గెలవగా, 2018లో జోహెనెస్‌ బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లేకుండానే కోహ్లి గ్యాంగ్‌ విజయం సాధించింది.  కోహ్లి కెప్టెన్సీలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లేని మరో నాలుగు మ్యాచ్‌లను డ్రా చేసుకోగా, 8 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి చవిచూసింది. తాజా టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 51 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌(89), రాస్‌ టేలర్‌(44)లు రాణించడంతో న్యూజిలాండ్‌కు ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లు సాధించగా, షమీ, అశ్విన్‌లు తలో వికెట్‌ తీశారు. (ఇక్కడ చదవండి: దక్షిణాఫ్రికా అతి పెద్ద పరాజయం)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు