ఆసీస్‌తో సిరీస్‌కు భారత జట్టు ఇదే..

15 Feb, 2019 17:11 IST|Sakshi

ముంబై: త్వరలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడబోయే భారత జట్టును ఎంపిక చేశారు. ప్రధానంగా రెండు టీ20ల సిరీస్‌తో పాటు తొలి రెండు వన్డేలకు టీమిండియా జట్టుకు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. విరాట్‌ కోహ్లి తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, రోహిత్‌ శర్మను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు.

ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇస్తారని తొలుత భావించారు. కాగా, రోహిత్‌ శర్మను రెండు టీ20ల సిరీస్‌తో పాటు తొలి రెండు వన్డేలకు కూడా ఎంపిక చేస్తూ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.  అంతకుముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టును దాదాపు ప్రకటించారు. ఇటీవల దేశవాళీ ఆకట్టుకుంటున్న పేసర్‌ ఉనాద్కట్‌కు చోటు దక్కుతుందని భావించినా అతనికి నిరాశే ఎదురైంది. భారత ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను తిరిగి జట్టులో ఎంపిక కాగా, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ కూడా టీ20 జట్టులో స్థానం దక్కి్ంచుకున్నాడు.

ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ( వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్‌ శంకర్‌, యజ్వేంద్ర చహల్‌, బూమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, సిద్దార్థ్‌ కౌల్‌, మయాంక్‌ మార్కండే

ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, కేదర్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, బూమ్రా, మహ్మద్‌ షమీ, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, విజయ్‌ శంకర్‌, రిషభ్‌ పంత్‌, సిద్ధార్ద్‌ కౌల్‌, కేఎల్‌ రాహుల్‌

మరిన్ని వార్తలు