ఇండస్‌ స్కూల్‌ జట్లు శుభారంభం

22 Sep, 2017 12:28 IST|Sakshi
ఇండస్‌ స్కూల్‌ జట్లు శుభారంభం


సీబీఎస్‌ఈ క్లస్టర్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: సీబీఎస్‌ఈ క్లస్టర్‌ స్పోర్ట్స్‌ మీట్‌ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో భాగంగా సికింద్రాబాద్‌లో జరిగిన బాస్కెట్‌బాల్‌ ఈవెంట్‌లో ఆతిథ్య ఇండస్‌ యూనివర్సల్‌ స్కూల్‌ జట్లు శుభారంభం చేశాయి. అండర్‌–19 బాలుర విభాగంలో ఇండస్‌ స్కూల్‌ జట్టు (తెలంగాణ) 33–13తో నలంద విద్యానికేతన్‌ (ఏపీ)పై గెలుపొందింది. విజేత జట్టులో తరుణ్‌ (10), ధరణ్‌ (8) ఆకట్టుకున్నారు. ఇతర మ్యాచ్‌ల్లో చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌ (తెలంగాణ) 44–3తో ఆశ్రమ్‌ పబ్లిక్‌ స్కూల్‌ (ఏపీ)పై, సెయింట్‌ పీటర్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (తెలంగాణ) 21–9తో కేకేఆర్‌ హ్యాపీ వ్యాలీ (ఏపీ)పై, సీఆర్‌పీఎఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ (తెలంగాణ) 32–9తో గ్లోబల్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (తెలంగాణ)పై గెలుపొందాయి.

 

మరోవైపు అండర్‌–17 బాలుర విభాగంలోనూ ఇండస్‌ యూనివర్సల్‌ స్కూల్‌ 25–7తో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (తెలంగాణ)ను ఓడించి ముందంజ వేసింది.  పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్స్‌ కమిషనర్‌ ఐపీఎస్‌ సీవీ ఆనంద్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి బాస్కెట్‌బాల్‌ టోర్నీని ప్రారంభించారు. బాస్కెట్‌బాల్‌తో పాటు గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో సీబీఎస్‌ఈ క్లస్టర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభమైంది. డీపీఎస్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ ఈవెంట్‌ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, డీజీపీ అనురాగ్‌ శర్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నీని ప్రారంభించారు.  

అండర్‌–17 బాలుర ఫలితాలు:

హెచ్‌పీఎస్‌ రామంతపూర్‌ 28–2తో విస్టా స్కూల్‌ (ఏపీ)పై, నవభారత్‌ పబ్లిక్‌ స్కూల్‌ (తెలంగాణ) 10–2తో మహారిషి విద్యా మందిర్‌ (తెలంగాణ)పై, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఖాజాగూడ (తెలంగాణ) 23–4తో ఓబుల్‌రెడ్డి (తెలంగాణ) స్కూల్‌పై, జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌ (తెలంగాణ) 44–14తో టైమ్‌ స్కూల్‌ (తెలంగాణ)పై, మెరిడియన్‌ స్కూల్‌ మాదాపూర్‌ (తెలంగాణ) 14–2తో సుప్రభాత్‌ మోడల్‌ స్కూల్‌ (తెలంగాణ)పై, ఒయాసిస్‌ స్కూల్‌ (తెలంగాణ) 24–8 ది గౌడియం స్కూల్‌ (తెలంగాణ)పై, భారతీయ విద్యాభవన్‌ (తెలంగాణ) 41–11తో శ్రీ ప్రకాశ్‌ విద్యానికేతన్‌ (ఏపీ)పై, పల్లవి మోడల్‌ స్కూల్‌ (తెలంగాణ) 28–5తో ఓపెన్‌ మైండ్స్‌ బిర్లా స్కూల్‌ (తెలంగాణ)పై, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (సైనిక్‌పురి) 17–16తో భవన్స్‌ శ్రీ రామకృష్ణ విద్యాలయ (సైనిక్‌పురి)పై, డీపీఎస్‌ (వరంగల్‌) 18–4తో ఆర్చిడ్స్‌ ది ఇంటర్నేషనల్‌ స్కూల్‌పై విజయం సాధించాయి.  

 

మరిన్ని వార్తలు