మిథాలి మీరు హీరోయిన్‌ కాదు: నెటిజన్లు

7 Sep, 2017 11:18 IST|Sakshi


సాక్షి, హైదరాబాద్‌:
భారత మహిళల కెప్టెన్‌ మిథాలి రాజ్‌కు నెటిజన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె డ్రెస్సింగ్‌ సెన్స్‌పై నెటిజన్లు ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ ఫోటోను ట్వీట్‌ చేసిన మిథాలికి ఫోటోను తొలగించాలంటూ కామెంట్స్‌ వచ్చాయి. మిథాలి సహచర క్రిడాకారిణీలతో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. అయితే నెటిజన్లు మాత్రం ఫోటోలో మిథాలి డ్రెస్స్‌ బాలేదని, ఫోటోను తొలిగించాలని సూచిస్తున్నారు.
 
మరికొందరైతే మీరు హీరోయిన్‌ కాదు క్రికెటర్‌ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక్కడి ప్రజల గురించి తెలిసి కూడా అలాంటి ఫోటోను షేర్‌ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  గత నెలలో కూడా మిథాలికి ఇదే అనుభవం ఎదురైంది.  ఓ నెటిజన్‌ మిథాలి చెమటపై కామెంట్‌ చేశాడు. దీనికి ఆమె తీవ్రంగానే మందలించింది. అయితే ఇప్పటి కామెంట్స్‌కు మాత్రం మిథాలి స్పందించలేదు.  
 
#tb #PostShootSelfie #funtimes #girlstakeover pic.twitter.com/p5LSXLYwmA
మరిన్ని వార్తలు