ప్రమోదతమకు నాలుగు పతకాలు

9 Sep, 2013 01:24 IST|Sakshi
ప్రమోదతమకు నాలుగు పతకాలు

జింఖానా, న్యూస్‌లైన్: అంతర్  జిల్లా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్విమ్మర్ ప్రమోదతమ నాలుగు పతకాలతో  సత్తా చాటింది. రంగారెడ్డి జిల్లా స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. మహిళల 400 మీ. వ్యక్తిగత మెడ్లేలో ప్రమోదతమ మొదటి స్థానంలో నిలిచింది. పోటీని 07:04:93 సెకన్లలో పూర్తి చేసింది. దీంతో పాటు 1500 మీ. ఫ్రీ స్టయిల్‌లో రజతం, 800 మీ. ఫ్రీ స్టయిల్‌లో కాంస్యం, 200 మీ. వ్యక్తిగత మెడ్లేలో కాంస్య పతకం సాధించింది. పురుషుల ఈవెంట్‌లో గురుచంద్ర, మహిళల ఈవెంట్‌లో భవ్య రెండేసి పతకాలు దక్కించుకున్నారు.
 
 ఇతర ఫలితాలు
 1500 మీ. ఫ్రీస్టయిల్ పురుషుల విభాగం: 1. నాగసాయి (రంగారెడ్డి), 2. శ్రీకాంత్ (క్రిష్ణా జిల్లా), 3. గురుచంద్ర (హైదరాబాద్); మహిళలు: 1. ప్రవళిక (క్రిష్ణా), 2. ప్రమోదతమ (హైదరాబాద్), 3. భవ్య (హైదరాబాద్); 200 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ పురుషులు: 1. ప్రవీణ్ బాబు (క్రిష్ణా), 2. శివకుమార్ (ఆదిలాబాద్), 3. రాజేష్ (క్రిష్ణా); మహిళలు: 1. స్నిగ్ధారెడ్డి (నిజామాబాద్), 2. కీర్తి హంసిక (క్రిష్ణా), 3. శ్రేయ ఠాకూర్ (రంగారెడ్డి); 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ పురుషులు: 1. కౌషిక్ రెడ్డి (విశాఖపట్నం), 2. సాయి ప్రసాద్ (రంగారెడ్డి), 3. చక్రవర్తి (ఆదిలాబాద్); మహిళలు: 1. నివేదిత (ఆదిలాబాద్), 2. సిరి (రంగారెడ్డి), 3. నాగస్వప్న (కర్నూల్); 100 మీ. బటర్ ఫ్లయ్  పురుషులు: 1. యోగిరాములు (విశాఖపట్నం), 2. గిరేంద్ర (రంగారెడ్డి), 3. గౌతమ్ సూర్య (రంగారెడ్డి); మహిళలు: 1. జాహ్నవి (ఆదిలాబాద్), 2. రితికా (విశాఖపట్నం), 3. దేవి ప్రియా (తూర్పు గోదావరి); 100 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ పురుషులు: 1. ప్రవీణ్ బాబు (క్రిష్ణా), 2. హేమంత్ (విశాఖపట్నం), 3. శివ (ఆదిలాబాద్); మహిళలు: 1. సాయి గ్రీష్మ (క్రిష్ణా), 2. లలిత (విశాఖపట్నం), 3. స్నిగ్ధా రెడ్డి (నిజామాబాద్); 400 మీ. ఫ్రీస్టయిల్ పురుషులు: 1. నాగ సాయి (రంగారెడ్డి), 2. శ్రీకాంత్ (క్రిష్ణా), 3. గురుచంద్ర (హైద రాబాద్); మహిళలు: 1. ప్రవళిక (క్రిష్ణా), 2. శ్రేష్ట (రంగారెడ్డి), 3. రమ్య కీర్తి (విశాఖపట్నం); 50 మీ. బటర్ ఫ్లయ్ పురుషులు: 1. సాయి ప్రసాద్ (రంగారెడ్డి), 2. కౌషిక్ (రంగారెడ్డి), 3. ప్రవీణ్ బాబు (క్రిష్ణా); మహిళలు: 1. విధు మేఘ (విశాఖపట్నం), 2. మేఘనాంజలి (తూర్పు గోదావరి), 3. అనన్య (రంగారెడ్డి); 400 మీ. వ్యక్తిగత మెడ్లే పురుషులు: 1. సాయి సంపత్ (విశాఖపట్నం), 2. యోగిరాములు (విశాఖపట్నం), 3. నాగసాయి (రంగారెడ్డి); మహిళలు: 1. ప్రమోదతమ (హైదరాబాద్), 2. జాహ్నవి (ఆదిలాబాద్), 3. భవ్య (హైదరాబాద్); 200 మీ. బ్యాక్ స్ట్రోక్ పురుషులు: 1. కిరీటి (కరీంనగర్), 2. గుణ చక్రవర్తి (ఆదిలాబాద్), 3. చిన్న నాగేంద్ర (విశాఖపట్నం); మహిళలు: 1. నివేదిత (ఆదిలాబాద్), 2. నాగస్వప్న (కర్నూల్), 3. రితిక (విశాఖపట్నం); 50 మీ. ఫ్రీస్టయిల్ పురుషులు: 1. గిరీంద్ర (రంగారెడ్డి), 2. సాయి సంపత్ (విశాఖపట్నం), 3. హేమంత్ (విశాఖపట్నం); మహిళలు: 1. మేఘన (విశాఖపట్నం), 2. సహన (రంగారెడ్డి), 3. మేఘనాంజలి (తూర్పు గోదావరి); 200 మీ. బటర్ ఫ్లయ్ పురుషులు: 1. యోగిరాములు (విశాఖపట్నం), 2. నాగ సాయి (రంగారెడ్డి), 3. నితీష్ (క్రిష్ణా); మహిళలు: 1. ప్రవళిక (క్రిష్ణా), 2. జాహ్నవి (ఆదిలాబాద్), 3. శ్రేష్ట (హైదరాబాద్); 800 మీ. ఫ్రీస్టయిల్ పురుషులు: 1. నాగసాయి (రంగారెడ్డి), 2. శ్రీకాంత్ (క్రిష్ణా), 3. యోగిరాములు (విశాఖపట్నం); మహిళలు: 1. ప్రవళిక (క్రిష్ణా), 2. శ్రేష్ట (రంగారెడ్డి), 3. ప్రమోదతమ ( హైదరాబాద్); 100 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ పురుషులు: 1. ప్రవీణ్ (క్రిష్ణా), 2. శివకుమార్ (ఆదిలాబాద్), 3. హేమంత్ (విశాఖపట్నం); మహిళలు: 1. లలిత (విశాఖపట్నం), 2. స్నిగ్ధా రెడ్డి (నిజామాబాద్), 3. సాయి గ్రీష్మ (క్రిష్ణా); 200 మీ. ఫ్రీస్టయిల్ పురుషులు: 1. సాయి సంపత్ (విశాఖపట్నం).
 

మరిన్ని వార్తలు