రన్నరప్‌ మానవ్‌ ఠక్కర్‌

6 Feb, 2018 01:16 IST|Sakshi
మానవ్‌ ఠక్కర్‌

అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) వరల్డ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భారత యువతార మానవ్‌ ఠక్కర్‌ రన్నరప్‌గా నిలిచాడు. లక్సెంబర్గ్‌లో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో జూనియర్‌ ప్రపంచ నంబర్‌వన్‌ మానవ్‌ 11–9, 3–11, 11–9, 6–11, 3–11, 11–9, 6–11తో టాప్‌ సీడ్‌ కనక్‌ ఝా (అమెరికా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.

సెమీఫైనల్స్‌లో మానవ్‌ 11–8, 11–8, 11–5, 11–8తో అబ్దుల్‌ అజీజ్‌ (ఈజిప్ట్‌)పై, కనక్‌ ఝా 11–3, 12–10, 11–9, 11–6తో ఇవోనిన్‌ డెనిస్‌ (రష్యా)పై గెలుపొందారు.    

మరిన్ని వార్తలు