దయచేసి క్రికెట్‌ను మతంతో కలపకండి : ఇంజమామ్‌

29 Dec, 2019 17:26 IST|Sakshi

కరాచి : పాక్‌ మాజీ స్పిన్నర్‌ దానిష్‌ కనేరియాకు కొందరు ఆటగాళ్ల తమ దగ్గరకు రానిచ్చేవారు కాదని వస్తున్న ఆరోపణలపై పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ స్పందించాడు. ఇంజమామ్‌ మాట్లాడుతూ.. దానిష్‌ కనేరియాను కొంతమంది ఆటగాళ్లు దూరంగా పెట్టేవారని, ఎవరు అతనితో తినడం కానీ బయటికి వెళ్లరని వస్తున్న ఆరోపణలను తాను ఖండిస్తున్నానని పేర్కొన్నాడు. తన కెప్టెన్సీలో కనేరియా చాలా మ్యాచ్‌లు ఆడాడని స్పష్టం చేశాడు.

సక్లెయిన్‌ ముస్తాక్‌ రిటైర్‌ అయిన తర్వాత ఒక లెగ్‌ స్పిన్నర్‌గా కనేరియా భవిష్యత్తులో మంచి ఆటగాడిగా పేరు సంపాదిస్తాడని అప్పట్లో జట్టు మేనేజ్‌మెంట్‌ భావించేది. తాను జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో దానిష్‌ కనేరియాతో ఏ ఒక్క ఆటగాడు కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని, తనకు తెలిసి ఒక ముస్లిమేతర ఆటగాడిని దూరంగా పెట్టడం చేయలేదని పేర్కొన్నాడు. దీనికి ఉదాహరణ పాక్‌ మాజీ బ్యాట్సమెన్‌ మహ్మద్‌ యూసఫ్‌ అని వెల్లడించాడు.

యూసఫ్‌ మతం మారకముందు ఒక క్రిస్టియన్‌ అని, అతని పేరు కూడా యూసఫ్‌ యోహన అన్న విషయం మీ అందరికి తెలిసిందే. అలాంటిది అతను మతం మారిన తర్వాత మహ్మద్‌ యూసఫ్‌గా పేరు మార్చుకున్నప్పుడు ఎలాంటి వివాదాలు చెలరేగలేదని గుర్తు చేశాడు. క్రికెట్‌ను, మతాన్ని ఎప్పుడు ఒకటిగా కలిపి చూడొద్దని ఇంజమామ్‌ పేర్కొన్నాడు. అంతేకాదు పాక్‌ ప్రజలు సహృదయులని, వారు అందరిని పెద్ద హృదయంతో అంగీకరిస్తారని అన్నాడు. అందుకు ఉదాహరణ పాక్‌ జట్టుకు నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో 15 సంవత్సరాల తర్వాత 2004లో భారత జట్టు పాక్‌లో పర్యటించింది.మ్యాచ్‌ల ఫలితం ఎలా ఉన్నా, అప్పుడు మేము భారత ఆటగాళ్లను గౌరవించిన తీరును పాక్‌ ప్రజలు తమ దేశానికి వచ్చిన వారిని ఎంతగా అభిమానిస్తారో మీకే తెలస్తుందని పేర్కొన్నాడు. అయితే మేం ఒక సంవత్సరం తర్వాత భారత పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అదే రీతిలో మాకు స్నేహపూర్వక స్వాగతం లభించిందని చెప్పుకొచ్చాడు. ఇరు దేశాల ప్రజల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని , ఈ విషయంలో తాను ఏ ఒక్కరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదని తెలిపాడు.  

ముస్లిమేతర ఆటగాళ్లను మాతో పాటు తిననివ్వలేదని ఆరోపణలను తాను కొట్టివేస్తున్నానని తెలిపాడు. 2005లో మేము భారత పర్యటనకు రాకముందు తాను సౌరవ్‌ గంగూలీ కొత్తగా ప్రారంభించనున్న హోటల్‌ను సచిన్‌తో కలిసి హాజరయ్యానని తెలిపాడు. ఆ తర్వాత  గంగూలీ తన రెస్టారెంట్‌ నుంచి చాలా సార్లు పంపించిన ఆహారాన్ని తాను ఎంతో ఇష్టంతో తినేవాడినని ఇంజమామ్‌ వెల్లడించాడు. 
(ఇక ఆపండి చాలు: షోయబ్‌ అక్తర్‌)
(‘కనేరియా.. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్‌’)

మరిన్ని వార్తలు