ఇంజమామ్ కే పూర్తి అధికారం!

4 Oct, 2016 12:34 IST|Sakshi
ఇంజమామ్ కే పూర్తి అధికారం!

కరాచీ:ఇంజమామ్ వుల్ హక్.. ఇటీవల పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా నియమించబడ్డాడు.ఆ పదవిని ఇంజమామ్ చేపట్టి దాదాపు ఆరు నెలలు కావొస్తుంది. అయితే ప్రస్తుతం పీసీబీలో ఇంజమామ్ కు కీలక వ్యక్తిగా మారాడు. అసలు పీసీబీ అనుమితి లేకుండానే నేరుగా జట్టును ప్రకటించే సామర్ధ్యాన్ని సృష్టించుకున్నాడు. సాధారణంగా పీసీబీ అనుమతి పొందిన తరువాతే జట్టును ప్రకటించడం పాక్ లో ఆనవాయితీ. కాగా,  ఎటువంటి బోర్డు అంగీకారం లేకుండానే జట్టును ప్రకటించే అధికారాన్ని ఇంజమామ్ కు  చైర్మన్ షహర్యార్  ఖాన్ అప్పచెప్సారు.  ఒక్కసారి జట్టును ఇంజమామ్ చూస్తే ఇక బోర్డు చూడాల్సిన అవసరం లేదని బోర్డు అధ్యక్షుడు షహర్యార్ అభిప్రాయపడినట్లు పీసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


ఇలా ఇంజమామ్ నేరుగా జట్టును ప్రకటించే అవకాశం దక్కించుకోవడానికి బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ చీఫ్ నథీమ్ సేథీనేనట. పాక్ జట్టు సెలక్షన్ లో ఇంజమామ్ కు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పాటు, మరింత అధికారం ఇస్తే బాగుంటుదని సేథీ సూచించడం, అందుకు షహర్యార్ ఆమోదం తెలపడం జరిగాయని బోర్డు వర్గాల సమాచారం.  ఇటీవల వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ కు సంబంధించి కూడా బోర్డు అనుమతి లేకుండా ఇంజమామే పాక్ జట్టును ప్రకటించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు