టోక్యోలో ‘ఇండియా హౌజ్‌’

11 Oct, 2019 05:41 IST|Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లబోయే భారత బృందం కోసం అక్కడ ‘ఇండియా హౌజ్‌’ను నిరమంచేందుకు జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ (జేఎస్‌డబ్ల్యూ) గ్రూప్‌ సిద్ధమైంది. ఈ మేరకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)తో ఈ దిగ్గజ స్టీల్‌ కంపెనీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒలింపిక్స్‌ ఆతిథ్య నగరాల్లో అభివృద్ది చెందిన దేశాలు ఇలాంటి హౌజ్‌లను నిరమించుకోవడం సహజం. కానీ భారత్‌ మాత్రం ఇలాంటి అధునాతన సౌకర్యాలతో హౌజ్‌ను నిర్మించుకోవడం ఇదే మొదటిసారి. క్రీడాగ్రామానికి సమీపంలో 2200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తొలిసారి భారత్‌ అక్కడ ఒలింపిక్‌ హాస్పిటాలిటీ హౌజ్‌ను నియమించనుంది

దీనికి సంబంధించిన ‘లోగో’ను జేఎస్‌డబ్ల్యూ గురువారం విడుదల చేసింది. ఈ హౌజ్‌లో భారత క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఉంటాయి. అలాగే అధికార వర్గాలకు సమాచార వేదిక, భారత్‌ నుంచి వెళ్లే ప్రేక్షకులు, మీడియా సిబ్బంది కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ అక్కడ ఉంటాయి. అలాగే భారతీయ వంటకాలన్నీ అందుబాటులో ఉంచుతారు. దీని వల్ల ఇంటి భోజనానికి దూరమైన భావనే కలగదని ఐఓఏ వర్గాలు తెలిపాయి. ఈ హాస్పిటాలిటీ హౌజ్‌ స్థూలంగా భారత వర్గాలందరికీ సమాచార, సమన్వయ వేదికగా ఉపయోగపడుతుందని ఐఓఏ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు