ఐపీఎల్-10 ఫైనల్ రిఫరీ ఎవరో తెలుసా?

13 May, 2017 22:33 IST|Sakshi
ఐపీఎల్-10 ఫైనల్ రిఫరీ ఎవరో తెలుసా?

న్యూఢిల్లీ: ఐపీఎల్-10 సీజన్లో మే 21న హైదరాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు రిఫరీగా భారత మాజీ దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్ ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. శ్రీనాథ్ క్వాలిఫైర్-1, ఫైనల్ మ్యాచ్ కు రిఫరీగా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక మే 16న జరగబోయే క్వాలిఫైర్-1 మ్యాచ్ కు ఎస్ రవి, శాంషుద్దీన్ లు, ఫైనల్ మ్యాచ్ కు రవి, నిగెల్ లియోంగ్ లను ఫీల్డ్ అంపైర్ లుగా నియమిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.

ఫ్లే ఆఫ్ మ్యాచ్ లకు రిఫరీలుగా శ్రీనాథ్, మనూ నాయర్, చిన్మయా శర్మ లు బాధ్యతలు నిర్వహించనున్నారు. జవగల్ శ్రీనాథ్ భారత్ తరపున 229 వన్డేలు ఆడాడు.  భారత తరపున వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ శ్రీనాథ్. 2003 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరిన భారత్ జట్టులో శ్రీనాథ్ కీలక సభ్యుడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా