ఐపీఎల్‌ నిర్వాహకులకు షాక్‌

5 Mar, 2018 13:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ఆరంభ వేడుకలను అట్టహాసంగా జరుపడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా వేదికగా ఏప్రిల్‌ 6 న అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు బీసీసీఐ భావించింది. అయితే తాజాగా ప్రారంభ వేడుకలపై సుప్రీంకోర్టు నియమిత పాలక కమిటీ(సీవోఏ) తీసుకున్న నిర్ణయం బీసీసీఐను షాక్‌కు గురి చేసింది.

అయితే ఏప్రిల్ 7న ఓపెనింగ్ మ్యాచ్ జరిగే రోజున వాంఖేడే స్టేడియంలో వేడుకలు నిర్వహించాలని సీవోఏ తాజాగా నిర్ణయించింది. అంతే కాకుండా రూ. 50 కోట్లతో ప్రారంభ వేడుకులు జరపాలన్న ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయానికి సీవోఏ బ్రేక్‌ వేస్తూ.. ఆ బడ్జెట్‌ మొత్తాన్ని రూ. 30 కోట్లకు కుదించింది. బడ్జెట్‌లో కోత, వేడుకల తేదీలో మార్పుతో  లీగ్‌లో తొలి మ్యాచ్ (ఏప్రిల్ 7) ఆరంభానికి కొన్ని గంటల ముందే వేడుకలు నిర్వహించడానికి బీసీసీఐ ప్రస్తుతం సన్నాహాలు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. 

కాగా ఐపీఎల్‌-11 సీజన్‌లో తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)ల మధ్య జరుగనుంది. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న సీఎస్‌కే సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటేందుకు కసరత్తులు చేస్తోంది.
 

మరిన్ని వార్తలు