సీఎస్‌కేను నిలువరించేనా?

17 Apr, 2019 19:43 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో సులువుగా విజయాల్ని అందుకుంటున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతోంది. బుధవారం స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న ఈమ్యచ్‌లో టాస్‌ గెలిచిన సీఎస్‌కే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ధోని విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో రైనా సీఎస్‌కేకు తాత్కాలిక  సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ధోనికి విశ్రాంతి నేపథ్యంలో బిల్లింగ్స్‌ తుది జట్టులోకి వచ్చాడు. సాంట్నర్‌ను కూడా పక్కకు పెట్టిన సీఎస్‌కే కరణ్‌ శర్మకు అవకాశం కల్పించింది. ఇక సన్‌రైజర్స్‌ కూడా రెండు మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో విఫలమైన రికీ భుయ్‌, అభిషేక్‌ శర్మ స్థానాలలో యుసుఫ్‌ పఠాన్‌, నదీమ్‌లకు అవకాశం కల్పించింది. 

వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొని నిరాశలో ఉన్న విలియమ్సన్‌ సేన ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలుపొందాలనే లక్ష్యంతో బరిలో దిగనుంది. మరోవైపు సన్‌రైజర్స్‌పై నెగ్గి ఈ మ్యాచ్‌తోనే ప్లే ఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకోవాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఉవ్విళ్లూరుతోంది. ఇదే జరిగితే ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా చెన్నై నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం మరో హోరాహోరీ పోరుకు సిద్ధమైంది. 

తుది జట్లు
సీఎస్‌కే: సురేశ్‌ రైనా(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, బిల్లింగ్స్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, కరణ్‌ శర్మ, దీపక్‌ చహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌

సన్‌రైజర్స్‌: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, దీపక్‌ హుడా, యుసుఫ్‌ పఠాన్‌, రషీద్‌ ఖాన్‌, నదీమ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌

Liveblog

మరిన్ని వార్తలు