చెన్నైతో తలపడేదెవరో?

8 May, 2019 19:11 IST|Sakshi

విశాఖపట్నం: ఐపీఎల్‌లో రన్నరప్‌ హోదాలో ఎలిమినేషన్‌ మ్యాచ్‌కు సిద్దమౌతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌....ఏడేళ్ల ఆనంతరం తిరిగి ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన ఢిల్లీ కాపిటల్స్‌ జట్ల మధ్య నాకౌట్‌ పోరుకు  విశాఖ వైఎస్‌ఆర్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. తొలిసారిగా ఐపీఎల్‌ నాకౌట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న విశాఖ స్టేడియం... సన్‌రైజర్స్‌కు రెండో హోమ్‌ గ్రౌండ్‌. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన శ్రేయాస్‌ అయ్యర్‌ సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. కోలిన్‌ ఇంగ్రామ్‌ను పక్కకు పెట్టిన ఢిల్లీ కోలిన్‌ మున్రోను తీసుకుంది. వరుసగా విఫలమవతుతున్న యూసఫ్‌ ఫఠాన్‌ను తప్పించిన సన్‌రైజర్స్‌ దీపక్‌ హుడాకు అవకాశం కల్పించింది. ఐపీఎల్‌ లీగ్‌ దశ ముఖాముఖిలో తలో మ్యాచ్‌ గెలిచాయి. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్యాలిఫయర్‌2లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. 

సమాయానుకూలం.. కీలకం
విశాఖలో ఎలిమినేషన్‌ మ్యాచ్‌ ఆడుతున్న రెండు జట్లకు పిచ్‌ కండిషన్‌ కొత్తే అయినా సమయానుకూలంగా ఆడిన జట్టే క్వాలిఫయింగ్‌కు చేరుకోగలదు. ఇరుజట్లలోనూ స్టార్‌ విదేశీ ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో లేరు.  రబడ గాయం కారణంగా వెనుతిరగ్గా విరుచుకుపడే వార్నర్‌ ఇంటి ముఖం పట్టాడు.  ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు టాప్‌ ఆర్డర్‌లోని పృధ్వీషా, రిషబ్‌ పంత్, శిఖర్‌ ధావన్‌లలో ఏ ఇద్దరు పదహారు ఓవర్ల వరకు నిలిచినా భారీ స్కోర్‌ నమోదు కానుంది. శిఖర్‌–పృధ్వీ ఓపెనర్లుగా రాణిస్తుండగా స్కిప్పర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ తోడవుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రబడ స్థానంలో ఇషాంత్‌ చెలరేగే అవకాశం ఉంది. . ట్రెంట్, అమిత్‌ మిశ్రా, అక్షర్‌ పటేల్‌ బంతితో చెలరేగనున్నారు.  ఇక సన్‌రైజర్స్‌ చాంపియన్‌ అనుభవంతో బరిలోకి దిగుతోంది. 

తుదిజట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్‌: శ్రేయాస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, కోలిన్‌ మున్రో, రిషభ్‌ పంత్‌, రూథర్‌ఫర్డ్‌, అక్షర్‌ పటేల్‌, కీమో పాల్‌, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ, ట్రెంట్‌ బౌల్ట్‌

సన్‌రైజర్స్‌: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), వృద్దిమాన్‌ సాహా, మార్టిన్‌ గప్టిల్‌, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, మహ్మద్‌ నబి, దీపక్‌ హుడా, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, బాసిల్‌ థంపి

Liveblog

మరిన్ని వార్తలు