సింగిల్‌ హ్యాండ్‌.. పొలార్డ్‌!

24 Mar, 2019 20:49 IST|Sakshi

సాక్షి, ముంబై : ముంబై ఇండియన్స్‌ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకొని ఔరా అనిపించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ పృథ్వీ షా(7) పరుగులకే అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సారథి శ్రేయాస్‌ అయ్యర్‌ మరో ఓపెనర్‌తో శిఖర్‌ ధావన్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ముంబై బౌలర్‌ మెక్లీన్‌గాన్‌ బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ గ్యాప్‌లో ఆడిన బంతిని సింగిల్‌ హ్యాండ్‌తో ఒడిసిపట్టుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన అయ్యర్‌ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం పొలార్డ్‌ పట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. సింగిల్‌ హ్యాండ్‌ పోలార్డ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు