యువరాజ్‌ను తప్పించేశారు..

6 Apr, 2019 20:07 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ రెండు మార్పులు చేసింది. తొలి మ్యాచ్‌ మినహా గొప్పగా ఆకట్టుకోని వెటరన్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ను తప్పించి అతడి స్థానంలో ఇషాన్‌ కిషాన్‌ను జట్టులోకి తీసుకుంది. మరో సీనియర్‌ ఆటగాడు లసిత్‌ మలింగ శ్రీలంక నుంచి రాలేకపోవడంతో అతడి స్థానంలో అల్జారీ జోసేఫ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక సన్‌రైజర్స్‌ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. విలియమ్సన్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. దీంతో భువనేశ్వర్‌ సారథిగా వ్యవహరించనున్నాడు.   

ఈ సీజన్‌లో జోరు మీదున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. మరోవైపు హ్యాట్రిక్‌ విజయాలతో ఊపుమీదున్న సన్‌రైజర్స్‌ డబుల్‌ హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అరవీర భయంకరంగా బ్యాటింగ్‌ చేసిన వార్నర్‌, బెయిర్‌ స్టోలు మరోసారి అదే రీతిలో రెచ్చిపోవాలని సన్‌రైజర్స్‌ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఇరుజట్లు బలంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌ మంచి ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. 

తుదిజట్లు
ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, పొలార్డ్‌, రాహుల్‌ చహర్‌, జోసేఫ్‌, జాసన్‌ బెహ్రన్‌డార్ఫ్‌, బుమ్రా

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: భువనేశ్వర్‌ కుమార్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, దీపక్‌ హుడా, పఠాన్‌, విజయ్‌ శంకర్‌, మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌   

Liveblog

మరిన్ని వార్తలు