క్రిస్‌ లిన్‌కు జాక్‌పాట్‌ లేదు..!

19 Dec, 2019 15:45 IST|Sakshi

కోల్‌కతా: ఈసారి ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ లిన్‌ కనీస ధరకే అమ్ముడుపోయాడు.  అతని కనీస ధర రూ. 2 కోట్లకే ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. క్రిస్‌ లిన్‌పై మిగతా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపెట్టకపోవడంతో అతను కనీస ధరకే పరిమితమయ్యాడు. ఈ వేలంలో లిన్‌కు అత్యధిక ధర పలుకుతుందని ఊహించనప్పటికీ లిన్‌కు నిరాశే ఎదురైంది. కోల్‌కోత్‌ నైట్‌ రైడర్స్‌ కూడా తమ స్టార్‌ ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ను వదిలేసుకుంది. 

క్రిస్‌ లిన్‌ (రూ. 9.6 కోట్లు)కు అత్యధిక మొత్తం చెల్లించి రావడంతోనే అతన్ని కేకేఆర్‌ వదిలేసుకుందనేది కాదనలేని  వాస్తవం. అబుదాబి టీ10 లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు లిన్‌ ఇటీవలే సొంతం చేసుకున్నాడు. కేకేఆర్‌ వదిలేసిన రోజుల వ్యవధిలోనే ఈ రికార్డును లిన్‌ సాధించాడు. మరాఠా అరేబియన్స్‌ తరుఫున లిన్‌ 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్‌ హేల్స్‌ టీ10 అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్‌ చేశాడు. అయినప్పటికీ లిన్‌ కోసం పెద్దగా పోటీ లేకుండా పోయింది. ఇక్కడ ముంబై ఇండియన్స్‌ అతన్ని కనీస ధరకే కొనుగోలు చేయడంతో జాక్‌పాట్‌ కొట్టిందనే చెప్పాలి.

మరిన్ని వార్తలు