'ఐపీఎల్‌ వేలంతో కలత చెందా'

6 Feb, 2018 13:29 IST|Sakshi
అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత కోచ్‌ ద్రవిడ్‌తో భారత క్రికెటర్లు

ముంబై: న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు సోమవారం స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా భారత్‌ జట్టు కప్‌ను సొంతం చేసుకుంది. అయితే భారత యువ జట్టు చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద‍్రవిడ్‌ను కొన్ని విషయాలు కలత చెందేలా చేశాయట. ఒకవైపు భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వేలం జరగడం తనను ఆందోళన గురి చేసిందన్నాడు.

ఈ మేరకు మీడియాతో ముచ్చటించిన ద్రవిడ్‌..'ఐపీఎల్‌ వేలానికి ముందు, వెనుక ఒక వారం రోజుల పాటు పరిస్థితులు ఇబ్బందికరంగా సాగాయి. కాగా కుర్రాళ్లు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకు వారిని కచ్చితంగా అభినందించాలి. ఐపీఎల్‌ వేలం ముగిసిన వెంటనే ప్రాక్టీస్‌ను కొనసాగించారు. ఆ మూడు రోజులు నాకు చాలా భయంగా అనిపించింది. ఐపీఎల్‌ వేలంతో కుర్రాళ్లు ఆందోళనకు లోనై మెగా టోర్నీలో ఏకాగ్రాత చూపలేకపోతారేమో అని భయపడ్డా. వాటిని అధిగమించి వరల్డ్‌ కప్‌ సాధించిన ఆటగాళ్లకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి' అని ద్రవిడ్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు