ఐపీఎల్ కెప్టెన్ల పర్ఫామెన్స్ రిపోర్టు

20 Apr, 2017 20:43 IST|Sakshi
ఐపీఎల్ కెప్టెన్ల పర్ఫామెన్స్ రిపోర్టు
హైదరాబాద్: ఐపీఎల్-10 సీజన్లో పాయింట్ల పట్టికను ఓ సారి పక్కన పెట్టి కెప్టెన్ల ప్రదర్శనను పరిశీలిస్తే.. కొంత మంది కెప్టెన్లు బాగా ఆడినా జట్టును గెలిపించలేక పోతున్నారు. మరికొందరూ నాయకులు ఆడకున్నా గెలిచి పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు జరిగన మ్యచ్ ల్లో ప్రతి కెప్టెన్ ప్రదర్శన పరిశీలిస్తే సన్ రైజర్స్ కెప్టెన్ డెవిడ్ వార్నర్ అందరీ నాయకుల్లో కంటే  ముందున్నాడు. ఇప్పటికే అధిక పరుగులతో ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్నా జట్టును మాత్రం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో  నిలుప లేక పోతున్నాడు. మరో స్కిప్పర్ రోహిత్ శర్మ నిలకడలేని ఫామ్ తో సతమవుతున్నా ముంబై ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శనతో విజయాలందుకుంటోంది. ఇలా ఓక్కోకెప్టెన్ వ్యక్తిగత రికార్డును పరిశీలిద్దాం.
 
1. డేవిడ్ వార్నర్, సన్ రైజర్స్ హైదరాబాద్: ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు 5 మ్యాచ్ ల్లో 137 స్ట్రైక్ రేట్ తో 235 పరుగులు చేసి అగ్రస్దానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక స్కోరు 76. ఇక జట్టు విజయాల పరంగా 5 మ్యాచ్ ల్లో 3 నెగ్గి 6 పాయింట్లతో మూడో స్దానంలో కొనసాగుతుంది.
 
2. గౌతమ్ గంభీర్, కోల్ కతా నైట్ రైడర్స్: ఆరేంజ్ క్యాప్ అందుకున్నా ఎక్కువ సేపు ఉండలేదు. 5 మ్యాచ్ ల్లో 142 స్ట్రైక్ రేట్ తో 196 పరుగులు చేసి అత్యధిక పరుగుల లిస్టులో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇక జట్టును తన బ్యాటింగ్ తో విజయాల వైపు పరుగులెత్తిస్తున్నాడు.అత్యధిక స్కోరు 76 నాటౌట్. ఐదు మ్యాచ్ లు ఆడిన కోల్ కతా నాల్గు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
 
3. స్టీవ్ స్మిత్, రైజింగ్ పుణే: ధోని కెప్టెన్సీకి ఎసరు పెట్టిన ఈ ఆసీస్ ఆటగాడు తన దూకుడైన బ్యాటింగ్ తో జట్టు ను ముందుకు నడింపించాలనుకున్నా ఇతరుల సాయం అందక జట్టు వరుస పరాజయాలను మూటగట్టుకుంది. నాలుగు మ్యాచ్ లు ఆడిన స్మిత్ 133 స్ట్రైక్ రేట్ తో 180 పరుగులు చేశాడు.అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఇక పుణే 5 మ్యాచ్ లు ఆడి రెండు మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నాలుగు మ్యాచ్ లకు స్మిత్ కెప్టెన్ గా వ్యవహిరించగా మరో మ్యాచ్ కు రహానే సారథ్యం వహించాడు.
 
4. సురేశ్ రైనా, గుజరాత్ లయన్స్: టీ20లు అంటే చెలరేగే సురేశ్ రైనా తన స్థాయి తగ్గ ప్రదర్శన ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక అర్ద సెంచరీ చేసినా, అది సురేశ్ రైనా స్థాయిని కనబర్చలేక పోయింది. 5 మ్యాచ్ లు ఆడిన రైనా 134 స్ట్రైక్ రేట్ తో 159 పరుగులు చేశాడు.అత్యధిక స్కోరు 68 నాటౌట్. ఇక ఐదు మ్యచ్ ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన లయన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్తానంలో నిలిచింది. గత సీజన్ లో మొదటి నుంచి అగ్రస్థానంలో కొన సాగిన లయన్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో అపజయాలు మూటగట్టుకుంది.
 
5.విరాట్ కోహ్లీ, బెంగళూరు రాయల్ చాలెంజర్స్: ఈ సీజన్లో లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాడు విరాట్ కోహ్లీ. భుజ గాయంతో ప్రారంభ మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే. కేవలం మూడు మ్యాచ్ లు ఆడిన కోహ్లీ తన బ్యాటింగ్ శైలి మాత్రం ఏ మాత్రం మారలేదు. అదే దూకుడు బ్యాటింగ్ తో  రెండు అర్ధ సెంచరీలతో 154 పరుగులు చేశాడు. అయితే మిగతా ఆటగాళ్లు విఫలమవడం, బౌలింగ్ విభాగం బలంగా లేకపోవడం కోహ్లీని కలవరపెడుతున్నాయి. వ్యక్తిగతంగా దూకుడు ప్రదర్శిస్తున్నా జట్టుకు విజయాలు అందించడంలో విఫలమవుతున్నాడు. నాయకత్వం వహించిన మూడు మ్యాచ్ ల్లో బెంగళూరు కేవలం ఒకే మ్యాచ్ నెగ్గింది. మొత్తం 6 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 6 స్థానంలో కొనసాగుతుంది. మిగతా మూడు మ్యాచ్ లకు వాట్సన్ నేతృత్వం వహించాడు.
 
6. గ్లేన్ మాక్స్ వెల్, కింగ్ప్ ఎలెవెన్ పంజాబ్: ఈ సీజన్లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన మాక్స్ వెల్ పంజాబ్ కు వరుస విజయాలు అందించాడు. ఎక్కువ పరుగులు చేయకున్న వేగమైన బ్యాటింగ్ శైలితో అభిమానులను అలరిస్తున్నాడు. మూడు ఇన్నింగ్స్ లు ఆడిన మాక్స్ వెల్ 174 స్ట్రైక్ రేట్ తో 124 పరుగులు చేశాడు. ఇక పంజాబ్ 5 మ్యాచ్ ల్లో 2 నెగ్గి పాయింట్ల పట్టికలో ఐదో స్దానంతో కొనసాగుతుంది.
 
7. రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ నిలకడ లేని ఫామ్ తో సతమతమవుతున్నాడు. 5 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ కేవలం 49 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్ ల్లో కేవలం 9 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 40 నాటౌట్. ఇక ముంబై మాత్రం విజయాలతో దూసుకుపోతుంది. ముంబై ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.
 
8. జహీర్ ఖాన్, ఢిల్లీ డేర్ డేవిల్స్: ఐపీఎల్-10 అన్ని జట్ల కెప్టెన్లు బ్యాటర్ప్ అయితే, జహీర్ మాత్రం బౌలర్. ఇక తన బౌలింగ్ ప్రదర్శనతో జహీర్ ఆకట్టుకుంటున్నాడు. కీలక వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాలుగు మ్యాచ్ లు ఆడిన జహీర్ 7 వికెట్లు పడగొట్టాడు. ఇక ఉత్తమ బౌలింగ్ 3/29. నాలుగు మ్యాచ్ ల్లో ఢిల్లీ 2 గెలిచి నాలుగో స్థానంలో కొన సాగుతుంది. 

 

>
మరిన్ని వార్తలు