తడబడి నిలబడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

12 May, 2018 21:50 IST|Sakshi

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ లక్ష్యం 182

సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా స్ధానిక ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు 182 పరుగుల లక్ష్యాన్ని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌(ఆర్సీబీ) ముందుంచింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నమ్మకాన్ని నిలబెడుతూ యుజ్వేంద్ర చహల్‌ ఆరంభంలోనే ఢిలీ​ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు. పృథ్వీ షా(2), జాసన్‌ రాయ్‌(12) విఫలమవ్వడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది.

దీంతో ఢిల్లీ కెప్టెన్‌ శ్రెయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌లు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత  రిషభ్‌ పంత్‌(61; 34 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు)ను మొయిన్‌ అలీ ఔట్‌ చేయడంతో 109 పరుగుల వద్ద  ఢిల్లీ మూడో వికెట్‌ను కోల్పోయింది. వెనువెంటనే శ్రేయాస్‌ అయ్యర్‌ నిష్క్రమించటంతో ఢిల్లీ స్కోర్‌బోర్డ్‌ నెమ్మదించింది. చివర్లో ఢిలీ​ అరంగేట్ర  ఆటగాడు అభిషేక్‌ శర్మ(46నాటౌట్‌; 19 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్‌ శంకర్‌(21 నాటౌట్‌; 20 బంతుల్లో; 2 ఫోర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ రెండు వికెట్లు సాధించగా, సిరాజ్‌, మొయిన్‌ అలీ తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

మరిన్ని వార్తలు