ఐపీఎల్: ఆ మ్యాచ్ వేదిక మారింది!

28 Mar, 2018 08:45 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఇక్కడి చిన్నస్వామి స్డేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ను వేరే ప్రాంతంలో నిర్వహించనున్నారు. మే 12న కర్ణాటక శాసనసభ ఎన్నికల నిర్వహణ తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ షెడ్యూల్ సమయంలో మే 12న చిన్నస్వామి స్డేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్‌ ఖరారు చేశారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అదేరోజు నిర్వహించనున్న నేపథ్యంలో ఆటగాళ్లకు భద్రత కల్పించడం సాధ్యం కాదని పోలీసుశాఖ స్పష్టం చేయగా.. వేదికను మార్చాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో వేరే ప్రాంతంలో మ్యాచ్ నిర్వహించాలని, అందుకు సన్నాహాలను ఐపీఎల్ నిర్వాహకులు ముమ్మరం చేశారు. త్వరలో వేదికను ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది. మిగిలిన మ్యాచ్‌లు యాథావిధిగా బెంగళూరులోనే జరుగుతాయని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.    

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు