ఐపీఎల్‌: ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల వేదికలు మార్పు

4 May, 2018 15:46 IST|Sakshi
ఐపీఎల్‌ ట్రోఫీ

పుణే నుంచి కోల్‌కతాకు తరలింపు

కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌ షెడ్యూల్‌ వేదికల్లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు పుణే మైదానం (మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) స్టేడియం) ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే రెండు మ్యాచ్‌ల వేదికలను కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌కు తరలిస్తూ శుక్రవారం ఐపీఎల్‌ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మే 23, 25 తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు కోల్‌కతాలో జరుగుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. 

పుణే స్టేడియం కన్నా చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్‌ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడెన్‌లో 67వేల మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించేందుకు అవకాశం ఉంది. క్వాలిఫయర్ 1 యథావిధిగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలోనే మే 22న జరగనుంది. మే 27న టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఈ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. తొలుత ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ హోం గ్రౌండ్‌ చపాక్‌ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సిండగా.. కావేరీ వివాదంతో ఆ జట్టు సొంతమైదానంగా పుణెలో ఆడుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు