ఈ భయాలు లేకుంటే.. ఆ మ్యాచ్‌ జరిగేది!

30 Mar, 2020 11:21 IST|Sakshi

ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) పంజా విసురుతోంది. భారత్‌లో సైతం వైరస్‌ విజృంభణతో 1071 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 29 మంది మృతి చెందారు. దీంతో బీసీసీఐ ప్రతిష్టాత్మంగా నిర్వహించే ఐపీఎల్‌-2020 ఏప్రిల్‌ 15 వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా 21 రోజల లాక్‌డౌన్‌ కోనసాగుతోంది. దీంతో పలువురు ప్రముఖులు ఇంట్లో ఉంటూ.. కరోనా వ్యాప్తి నియంత్రణకు సోషల్‌ మీడియా ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే, తాజాగా ముంబై క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కాస్త భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. (లాక్‌డౌన్‌:  బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్న క్రీడాకారిణి)

‘కేవలం భౌతికంగానే ఇంట్లో ఉన్నాను. కానీ, నా మనసు మొత్తం వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ఉంది’ అని సూర్యకుమార్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. వాంఖడే స్టేడియం, ఇంట్లో దిగిన రెండు ఫోటోలను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. కాగా, సూర్యకుమార్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు సభ్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సీజన్‌లో కూడా ఆయన ముంబై ఇండియన్స్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలాఉండగా.. కరోనా భయాలు గనుక లేకుంటే ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో ఐపీల్‌ తొలి మ్యాచ్‌ జరగాల్సింది. ప్రస్తుతం భారత్‌ యుద్ధ ప్రాతిపదికన కరోనా వైరస్‌ కట్టడికి చర్యలు చేపడుతోంది.(బీసీసీఐ విరాళం రూ. 51 కోట్లు)

మరిన్ని వార్తలు