కొన్ని ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయి: ద్రవిడ్‌

29 Nov, 2019 09:57 IST|Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌లో భారత కోచ్‌లను తీసుకోకుండా ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయని మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయ పడ్డాడు. లీగ్‌లో ఎక్కువ మంది మన ఆటగాళ్లే ఉంటారని, వారిని అర్థం చేసుకోవడంలో భారత కోచ్‌లే ముందుంటారని అతను అన్నాడు. ఎంతో మంది ప్రతిభావంతులైన కోచ్‌లు మనకు అందుబాటులో ఉన్నారని... హెడ్‌ కోచ్‌గా పెట్టుకునే  అవకాశం∙లేకపోతే కనీసం అసిస్టెంట్‌ కోచ్‌గానైనా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ద్రవిడ్‌ సూచించాడు.  

‘మన​కు చాలా మంచి కోచ్‌లు ఉన్నాయి. మన వాళ్ల యొక్క శక్తి సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. మన క్రికెట్‌ డిపార్ట్‌మెంట్‌లో చాలా టాలెంట్‌ ఉంది. ప్రత్యేకంగా మెరుగైన కోచ్‌లు భారత్‌ సొంతం. వారికి మనం అవకాశాలు ఇవ్వాలి’ అని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు.  కనీసం ఐపీఎల్‌లో మన వాళ్లను అసిస్టెంట్‌ కోచ్‌లుగా కూడా తీసుకోకపోవడం తనను నిరాశకు గురి చేస్తుందన్నాడు. కొన్ని ఫ్రాంచైజీలు భారత్‌ కోచ్‌లను ఎంపిక చేసుకుని లాభం పొందుతున్నాయి. ఆయా ఫ్రాంచైజీలకు భారత్‌ ప్లేయర్స్‌ గురించి తెలుసన్నాడు.

మరిన్ని వార్తలు