ఇరాన్‌కు చుక్కెదురు

18 Oct, 2016 01:15 IST|Sakshi
ఇరాన్‌కు చుక్కెదురు

అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్‌లో లీగ్ దశ పోటీలను అజేయంగా ముగించాలని ఆశించిన ఇరాన్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో పోలాండ్ 41-25తో ఇరాన్‌పై సంచలన విజయం సాధించింది. కెప్టెన్ మైకేల్ స్పిక్‌కో అత్యధికంగా 12 పాయింట్లు... పిటోర్ పాములాక్ తొమ్మిది పాయింట్లు సాధించి పోలాండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆట మూడో నిమిషంలో తొలిసారి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన పోలాండ్ ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి ఇరాన్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ గ్రూప్ నుంచి ఇరాన్ ఇప్పటికే సెమీస్‌కు చేరింది.
 
బంగ్లాదేశ్ భారీ విజయం
మరోవైపు గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 72 పాయింట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి సెమీస్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన బంగ్లాదేశ్ 80-8తో ఆస్ట్రేలియాను ఓడించి ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ జట్టులో అరుద్ జమాన్ మున్షీ 17 పాయింట్లు, సాబుజ్ మియా 10 పాయింట్లు సాధించారు.
 
 ప్రపంచకప్‌లో నేడు
 అమెరికా vs కెన్యా
 రాత్రి గం. 8.00 నుంచి
 
 భారత్ vs ఇంగ్లండ్
 రాత్రి గం. 9.00 నుంచి
 
 స్టార్ స్పోర్‌‌ట్స-2లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు