ఆ రెండు దేశాలకు టెస్టు హోదా

22 Jun, 2017 22:26 IST|Sakshi
ఆ రెండు దేశాలకు టెస్టు హోదా

లండన్‌: టెస్టు మ్యాచ్‌ ఆడాలంటే అందుకు హోదా ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు హోదా పొందటం అంత సులభం కాదు. ఇప్పటి వరకూ 10దేశాలకు టెస్టు హోదా ఉంది. దాదాపు 17 సంవత్సారాల అనంతరం మరో రెండు దేశాలు ఈ జాబితాలో చేరాయి. చివరిసారిగా బంగ్లాదేశ్‌ 2000లో టెస్టు హోదా పొందింది. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరెండు పసికూనలకు ఆహోదా లభించింది.

గురువారం ఐసీసీ ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌ దేశాలకు టెస్టు హోదా కల్పించింది. జరిగిన ఐసీసీ సమావేశంలో కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ టెస్టు మ్యాచ్‌లు ఆడే దేశాలు 10 నుంచి 12కు పెరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌, ఐర్లాండ్‌లు పలు ప్రపంచకప్‌ పోటీల్లో సంచలన విజయాలు నమోదు చేశాయి. ఈసందర్భంగా ఐసీసీ ఛైర్మెన్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ రెండు జట్లకు శుభాకాంక్షలు తెలిపాడు. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, జింబాంబ్వే, బంగ్లాదేశ్‌లు టెస్టు హోదా కలిగిఉన్నాయి.

మరిన్ని వార్తలు