టాస్‌ గెలిచి ఫిల్డింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌

27 Jun, 2018 21:05 IST|Sakshi

భారత్‌, ఐర్లాండ్‌ మధ్య డబ్లిన్‌లోని మలహిదే క్రికెట్‌ గ్రౌండ్‌ తొలి టీ-20కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తుది జట్టులో దినేష్‌ కార్తీక్‌, లోకేష్‌ రాహుల్‌లకు స్థానం దక్కలేదు. ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ-20 మ్యాచ్‌తో ఎంఎస్ ధోనీ, సురేష్ రైనాలు అరుదైన ఘనతను సాధించారు. ఈ తొలి టీ20 మ్యాచ్‌తో టీమిండియా 100 అంతర్జాతీయ టీ-20ల మైలురాయిని చేరుకున్న విషయం విదితమే. తొలి టీ-20లో, 100వ టీ-20లో ఆడిన ఆటగాళ్లుగా ధోని, రైనాలు రికార్డును సాధించారు. ఇండయా జట్టు 2006లో మొదటి టీ-20 మ్యాచ్‌ ఆడింది. ఈ ఘనతను దినేష్‌ కార్తీక్‌ కోల్పోయాడు. తొలి టీ-20 మ్యాచ్‌ ఆడిన కార్తీక్‌.. 100వ టీ-20 ఆడుతున్న టీంలో తుది జట్టులో స్ధానం దక్కించులేదు.

ఇండియా జట్టు 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. టీమిండియా తమ స్థాయికి తగినట్లుగా విజయంపై దృష్టి పెట్టగా... గతంలోనూ పలు సంచలనాలు నమోదు చేసిన ఐర్లాండ్‌ సొంతగడ్డపై మరోసారి అలాంటి ఆటతీరు కనబర్చాలని పట్టుదలగా ఉంది. జట్టు బలాబలాలు, ఫామ్‌ దృష్ట్యా చూస్తే భారత్‌ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇటీవలే టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌కు టీ20ల్లో కూడా మంచి రికార్డు ఉండటం, స్థానిక పరిస్థితుల అనుకూలత కారణంగా మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.  

తుది జట్లు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్,సురేష్‌ రైనా,మనీష్‌ పాండే, హర్దిక్‌ పాండ్యా,ధోని, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా
 
ఐర్లాండ్‌: విల్సన్‌ (కెప్టెన్‌), స్టిర్లింగ్, షెనాన్, బల్బిర్నీ, సిమిసింగ్, కెవిన్‌ ఓబ్రైన్, థాంప్సన్, పాయింటర్, డాక్‌రెల్, రాంకిన్‌, ఛేజ్‌. 
 

మరిన్ని వార్తలు