టీమిండియా మూడో ఫాస్ట్‌ బౌలర్‌గా..

30 Aug, 2018 16:38 IST|Sakshi

సౌతాంప్టన్‌: టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో నాల్గో టెస్టులో జో రూట్‌ను ఔట్‌ చేసిన ఇషాంత్‌.. టెస్టు కెరీర్‌లో 250వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా భారత్‌ తరపున ఈ ఫీట్‌ సాధించిన మూడో ఫాస్ట్‌ బౌలర్‌గా ఇషాంత్‌ గుర్తింపు సాధించాడు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఎనిమిదో ఓవర్‌ అందుకున్న ఇషాంత్‌.. ఆ ఓవర్‌ తొలి బంతికే జో రూట్‌ను ఎల్బీగా పెవిలియన్‌ పంపాడు. దాంతో టెస్టు ఫార్మాట్‌లో 250వ వికెట్‌ను సాధించాడు. అంతకుముందు భారత్‌ నుంచి 250 టెస్టు వికెట్లు సాధించిన పేసర్లలో కపిల్‌ దేవ్‌, జహీర్‌ ఖాన్‌లు మాత్రమే ఉన్నారు. కపిల్‌దేవ్‌ తన కెరీర్‌లో 434 టెస్టు వికెట్లు సాధించగా, జహీర్‌ ఖాన్‌ 311 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత 250 మార్కును అందుకున్న భారత పేసర్‌ ఇషాంత్‌ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ కీటన్‌ జెన్నింగ్స్‌ డకౌట్‌గా ఔట్‌ కాగా, జో రూట్‌(4)సైతం నిరాశపరిచాడు.

మరిన్ని వార్తలు