పాంటింగ్‌ బెస్ట్‌ కోచ్‌: సీనియర్‌ బౌలర్‌

19 May, 2020 09:21 IST|Sakshi

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా మాజీ సారథి, ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌పై సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన ఇషాంత్‌ పలు ఆసక్తికవిషయాను వెల్లడించాడు. తాను కలిసిన వారిలో పాంటింగ్‌ అత్యుత్తమ కోచ్‌ అని లంబూ స్పష్టం చేశాడు.‘గడేడాది ఐపీఎల్‌లో ఆడేందుకు జట్టులో చేరినప్పుడు కాస్త ఇబ్బందిపడ్డాను. ఆ సమయంలో నా మొద‌టి చాయిస్ ఎప్పుడూ నువ్వే.. సీనియ‌ర్‌వి కాబ‌ట్టి కొత్త కుర్రాళ్లకు దారి చూపించు అని పాంటింగ్‌ పేర్కొంటూ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. సీనియర్‌గా ఎలా ఉండాలో నేర్పాడు. అతని సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి’ అంటూ ఇషాంత్‌ పేర్కొన్నాడు. 


ఈ క్రమంలో 2008లో భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ గురించి లంబూ వద్ద అభిమానులు ప్రస్తావించారు. ‘ఇక పాంటింగ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కొన‌సాగుతున్నప్పుడు ఎక్కువ సార్లు  ఔట్ చేయ‌డం, అతడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన విషయం ఎప్పటికీ మరిచిపోలేను. ముఖ్యంగా 2008లో జరిగిన పెర్త్‌ టెస్టులో పాంటింగ్‌కు బౌలింగ్‌ చేసిన విధానం, అనంతరం స్వదేశంలో అతడిని ఇబ్బంది పెట్టిన తీరు నా కెరీర్‌లో చాలా గొప్పవి’ అని ఇషాంత్‌ పేర్కొన్నాడు. ఇక ప్రసుతం భారత టెస్టు జట్టులో రెగ్యులర్‌ బౌలర్‌ అయిన ఇషాంత్‌ నిలకడగా రాణిస్తూ జూనియర్లకు మార్గనిర్దేశకం చేస్తున్నాడు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున లంబూ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక గత సీజన్‌లో ఢిల్లీ తరుపున 13 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్‌ 13 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి:
‘కశ్మీర్‌ గురించి పట్టించుకోవడం మానేయ్‌’
‘ఆ ఇన్నింగ్స్‌’ ఆడాలనుంది!

మరిన్ని వార్తలు