ఈశ్వర్ పాండే హ్యాట్రిక్

2 Jan, 2016 19:31 IST|Sakshi
ఈశ్వర్ పాండే హ్యాట్రిక్

వడోదర:ముస్తాక్ అలీ ట్వంటీ 20 ట్రోఫీలో మధ్యప్రదేశ్ పేస్ బౌలర్ ఈశ్వర్ పాండే హ్యాట్రిక్ నమోదు చేశాడు. గ్రూప్-సిలో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో పాండే ఈ ఘనతను అందుకున్నాడు. ఆంధ్ర  కోల్పోయిన తొలి మూడు వికెట్లను పాండే తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ సాధించాడు. పాండే మూడో ఓవర్ ను అందుకుని ఆ ఓవర్ మూడో బంతికి ఆంధ్ర కెప్టెన్ భరత్(9) ను పెవిలియన్ కు పంపగా, ఆ తరువాత వరుస బంతుల్లో ప్రశాంత్ , శ్రీకాంత్లను అవుట్ చేశాడు.  ఓవరాల్ గా 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను సాధించిన పాండే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వడోదరలోని రిలయన్స్ స్టేడియంలో మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లోతొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆంధ్ర టాపార్డర్ లో భరత్(9),ప్రశాంత్(3), శ్రీకాంత్(9), ప్రదీప్(0), అశ్విన్ హెబర్(15) ఘోరంగా విఫలం చెందడంతో జట్టు వంద మార్కులు అంకెను కూడా చేరలేదు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన మధ్యప్రదేశ్ 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మధ్యప్రదేశ్ ఆటగాళ్లలో హర్ ప్రీత్ సింగ్(40 నాటౌట్) రాణించగా, సహాని(22), ధలివాల్(25 నాటౌట్)లు విజయంలో సహకరించారు.

మరిన్ని వార్తలు