చెత్రి ‘హ్యాట్రిక్’నార్త్ ఈస్ట్‌పై ముంబై గెలుపు

29 Oct, 2015 01:51 IST|Sakshi
చెత్రి ‘హ్యాట్రిక్’నార్త్ ఈస్ట్‌పై ముంబై గెలుపు

ముంబై: భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో చెలరేగడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ముంబై సిటీ ఎఫ్‌సీ సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 5-1తో నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీని చిత్తు చేసింది. ముంబై తరఫున చెత్రి (25, 40, 48వ. ని.), నోర్డి (51వ ని.), బెర్టిన్ (87వ ని.) గోల్స్ చేయగా... బోతాంగ్ (29వ ని.) నార్త్ ఈస్ట్‌కు ఏకైక గోల్ అందించాడు. ఈ సీజన్‌లో ఇది రెండో హ్యాట్రిక్. చెన్నైయిన్‌కు చెందిన స్టీవెన్ మెండోజా... గోవాపై తొలి హ్యాట్రిక్ సాధించాడు. 10 పాయింట్లతో ముంబై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా.. ఢిల్లీ డైనమోస్‌తో తలపడుతుంది.

మరిన్ని వార్తలు