రజతం... ఒలింపిక్‌ బెర్త్‌ 

27 Apr, 2019 01:06 IST|Sakshi

మెరిసిన భారత టీనేజ్‌ షూటర్‌ దివాన్ష్‌

బీజింగ్‌: ప్రపంచ కప్‌ షూటింగ్‌ టోర్నీలో రాజస్తాన్‌ టీనేజ్‌ షూటర్‌ దివాన్ష్‌ సింగ్‌ పన్వర్‌ పసిడి పతకంపై గురి పెట్టాడు. కానీ త్రుటిలో బంగారం చేజారినా... బంగారంలాంటి ఒలింపిక్స్‌ కోటా మాత్రం దక్కింది. ఇక్కడ జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో అతను 249 పాయింట్లు సాధించాడు. కేవలం 0.4 పాయింట్ల తేడాతో స్వర్ణావకాశం కోల్పోయిన 17 ఏళ్ల దివాన్ష్‌ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.

ఆతిథ్య చైనాకు చెందిన జిచెంగ్‌ హుయ్‌ 249.4 పాయింట్లతో పసిడి నెగ్గాడు. తాజా దివ్యాన్‌‡్ష ప్రదర్శనతో భారత్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో బెర్త్‌ లభించింది. ఇదివరకు అంజుమ్, అపూర్వీ చండేలా (మహిళలు), సౌరభ్‌ (పురుషులు) ఒలింపిక్స్‌ కోటాలు సాధించారు. 

మరిన్ని వార్తలు