ఆ ఫోటోల గురించి తర్వాత మాట్లాడదాం: గుత్తా జ్వాల

2 Jan, 2020 14:07 IST|Sakshi

హైదరాబాద్‌:  న్యూ ఇయర్‌ సందర్భంగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్వీటర్‌లో షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. బుధవారం తమిళ హీరో  విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందనే వార్తలు హల్‌చేస్తున్నాయి. అయితే వీటిపై మాట్లాడటానికి గుత్తా జ్వాల నిరాకరించారు. గురువారం బ్యాడ్మింటన్‌ అకాడమీని ప్రారంభించిన జ్వాల మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా ఆ ఫోటోలకు గురించి జ్వాలను ప్రశ్నించగా తర్వాత మాట్లాడదాం అంటూ సమాధానం దాటవేశారు.(ఇక్కడ చదవండి: హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్‌)

కాగా, ప్రస్తుతం తాను ప్రారంభించిన అకాడమీని సుమారు రూ. 14 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. ఇది కూడా అతి పెద్ద అకాడమీనేనని చెప్పిన జ్వాల.. కేవలం బ్యాడ్మింటన్‌కే కాకుండా మిగతా స్పోర్ట్స్‌కు కూడా ఈ అకాడమీ సేవలందిస్తుందన్నారు. తనకు ఇతర రాష్ట్రాల్లో కూడా అకాడమీలను నిర్మిస్తారా అన్న ప్రశ్నకు.. అవకాశం వస్తే అక్కడ కూడా నిర్మిస్తానని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని సుజాత హైస్కూల్‌ ప్రాంగణంలో ఈ అకాడమీని నెలకొల్పారు. గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో 14 బ్యాడ్మింటన్‌ కోర్టులు, అత్యాధునిక జిమ్నాజియం ఉన్నాయి. ఈ అకాడమీలో బ్యాడ్మింటన్‌తోపాటు క్రికెట్, స్విమ్మింగ్‌ క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు.

మరిన్ని వార్తలు