50 టెస్టులాడాకే అంచనాకు రావాలి: కపిల్ దేవ్

18 Sep, 2016 02:05 IST|Sakshi

బెంగళూరు: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ ఆటగాడిని ఆల్‌రౌండర్‌గా తేల్చేందుకు అతడు కనీసం 50 టెస్టులైనా ఆడాల్సి ఉంటుందని విఖ్యాత క్రికెటర్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. అంతేకానీ రెండు, మూడు సిరీస్‌లు మెరుగ్గా రాణించినంత మాత్రాన ఒక ఆటగాడిని ఆల్‌రౌండర్‌గా పరిగణించలేమని ఆయన అన్నారు. 

‘ఓ ఆటగాడిని ఉత్తమ ఆల్‌రౌండర్ కేటగిరీలో చేర్చాలంటే అతడికి కనీసం 50 టెస్టులాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే అతడి గురించి ఓ అంచనాకు రావాలి. అంతేకానీ స్వల్ప కాలంలోనే అతడిపై ఓ అంచనాకు రావడం సరికాదు. అరుుతే ప్రస్తుత తరం ఆల్‌రౌండర్లకు చాలా నైపుణ్యం ఉంది. వారిని గౌరవించాల్సిందే’ అని కపిల్ చెప్పారు. ఫాస్ట్ బౌలింగ్‌తో కూడిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో తానే చివరి వాడినని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు