‘ఆ ఇద్దరితో ఆడాలనే నాకల నిజమైంది’

28 Jan, 2018 21:54 IST|Sakshi
వాషింగ్టన్‌ సుంధర్‌

చెన్నై : గత ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణే తరుపున ఆడి మహేంద్రసింగ్‌ ధోని, కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌లను మెప్పించిన తమిళ యువకెరటం, స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఈ ఏడు వేలంలో రూ.3.3 కోట్లు పలికాడు. ఈ ధరకు రాయల్‌ఛాలెంజర్స్‌ బెంగళూరు సుంధర్‌ను సొంతం చేసుకుంది. ఈ తరుణంలో  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలయర్స్‌తో కలిసి ఆడాలనే తన కల నేరవేరిందని ఈ యంగ్‌ క్రికెటర్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

‘నన్ను ఆర్‌సీబీ ఎంచుకోవడం ఆనందం కలిగించింది. నేను విరాట్‌ కోహ్లికి, ఏబీ డివిలియర్స్‌కు పెద్ద అభిమానిని.  గతేడాది రైజింగ్‌పుణే తరుపున ధోనితో కలిసి ఆడటం ఇప్పుడు ఈ లెజెండ్స్‌తో ఆడే అవకాశం రావడం వెలకట్టలేని అనుభవమని’ వాషింగ్టన్‌ సుందర్‌ తెలిపాడు.

ధోని దగ్గర నేర్చుకున్న మెళుకువలు ఆర్సీబీ జట్టుకు ఎంపిక చేశాయని, ఈ జట్టులో సైతం సీనియర్‌ ప్లేయర్ల ఆటను దగ్గర నుంచి చూసి మరింత నేర్చుకుంటున్నాని ఈ 18 ఏళ్ల యువస్పిన్నర్‌ చెప్పుకొచ్చాడు. తన లక్ష్యం మాత్రం భారత జట్టులో చోటు సంపాదించుకోవడమేనని, ఇందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటానన్నాడు. 

ఇక సుంధర్‌ అత్యధిక ధర పలకడంపై అతని తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. యువక్రికెటర్లకు ఐపీఎల్‌ చక్కని వేదికని, సుంధర్‌లాంటి క్రికెటర్లకు తమ టాలెంట్‌ నిరూపించుకోవాడనికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా