ఇదొక మాయని మచ్చ: వార్నర్‌

29 Mar, 2018 12:39 IST|Sakshi
డేవిడ్‌ వార్నర్‌

సిడ్నీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. ట్యాంపరింగ్‌కు సహకరించి గేమ్‌కు మాయని మచ్చ తెచ్చిన విషయాన్ని అంగీకరించిన వార్నర్‌.. ఇందులో తన భాగస్వామ్యం ఉన్నందుకు క్షమాపణలు చెప్పాడు.

'ఆస్ట్రేలియాలో ఉన్న క్రికెట్‌ అభిమానులకు, ప‍్రపంచంలోని అభిమానుల్ని క్షమించమని కోరుతున్నా. నేను సిడ్నీకి తిరిగి వస్తున్నా. తప్పిదాలు అనేవి క్రికెట్‌ అనే ఆటకు మచ్చ తెస్తూనే ఉన్నాయి. ట్యాంపరింగ్‌కు సహకరించడంలో నా భాగస్వామ్యం కూడా ఉన్నందుకు క్షమించండి. మా జట్టు ట్యాంపరింగ్‌ ఉదంతం కచ్చితంగా అభిమానుల్ని వేదనకు గురి చేసి ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోగలను. ప్రస్తుతం క్షమాపణలు మాత్రమే నేను చెప్పలగలను' అని ఉదంతం తర్వాత వార్నర్‌ తొలిసారి పెదవి విప్పాడు.

మరిన్ని వార్తలు