మాజీ కెప్టెన్లతో ధోనిని పోల్చడం అన్యాయం

26 Jun, 2013 21:00 IST|Sakshi
Sunil Gavaskar

మహేంద్ర సింగ్ ధోనిని మాజీ కెప్టెన్లతో  పోల్చడం అన్యాయమని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.  భారత జట్టు చాంపియన్ ట్రోఫీ గెలవడంతో ప్రపంచ క్రికెట్ లో మూడు మేజర్ టైటిల్స్  సాధించిన మొదటి కెప్టెన్ గా ధోనీ రికార్డుకెక్కాడు. దీంతో ధోనీ అత్యుత్తమ సారధి అన్న  ప్రచారం జరుగుతోంది. దీనిపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ... భిన్న తరాల మధ్య  పోలిక తేవడం న్యాయం కాదని అన్నాడు.

ధోని ఉత్తమ నాయకుల్లో ఒకడని అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతడు సాధించిన విజయాలే ఆ విషయం స్సష్టం చేస్తున్నాయని చెప్పాడు. టెస్టులో టీమిండియాను నంబర్ వన్ స్థానంలో నిలిపాడని, 2011లో వన్డే ప్రపంచకప్, 2007లో టి20 వరల్డ్ కప్,  తాజాగా చాంపియన్స్ ట్రోఫీలను దేశానికి అందించాడని గుర్తు చేశారు. ధోని సాధించిన విజయాలను తాము కూడా మెచ్చుకున్నామని తెలిపాడు. మాజీ బ్యాట్స్ మెన్ అజయ్ జడేజా కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు