అమెరికా క్రికెట్‌ జట్టు కోచ్‌గా అరుణ్‌

29 Apr, 2020 02:24 IST|Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేసిన కర్ణాటక మాజీ క్రికెటర్‌ జె.అరుణ్‌ కుమార్‌కు మంచి అవకాశం లభించింది. అమెరికా క్రికెట్‌ జట్టుకు అతను హెడ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నుంచి అమెరికాకు వన్డే హోదా లభించింది. భవిష్యత్‌లో అమెరికాకు టెస్టు హోదా అందించడమే తన సుదీర్ఘ లక్ష్యమని 45 ఏళ్ల అరుణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించాడు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి... తనకు వీసా మంజూరు కాగానే అమెరికాకు వెళ్తానని అరుణ్‌ అన్నాడు. అరుణ్‌ కోచ్‌గా ఉన్న సమయంలోనే కర్ణాటక జట్టు 2013–14; 2014–15 సీజన్‌లలో రంజీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ, ఇరానీ కప్‌ టైటిల్స్‌ నెగ్గి అరుదైన ‘ట్రిపుల్‌’ ఘనత సాధించింది. 

మరిన్ని వార్తలు