జడేజా అరుదైన ఘనత

20 Dec, 2016 13:01 IST|Sakshi
జడేజా అరుదైన ఘనత

చెన్నై:ఇంగ్లండ్ తో చివరిటెస్టులో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. చివరిరోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్(49)ను జడేజా అవుట్ చేశాడు. జడేజా సంధించిన ప్రమాదకరమైన బంతిని కుక్ ఆడటంలో విఫలమై లెగ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ 103 పరుగుల వద్ద తొలి వికెట్ ను నష్టపోయింది. అయితే కుక్ వికెట్ ను సాధించే క్రమంలో జడేజా ఒక అరుదైన ఫీట్ ను సాధించాడు. ఈ సిరీస్లో ఆరుసార్లు జడేజా బౌలింగ్ లో కుక్ అవుటయ్యాడు.

 

ఇలా ఒక సిరీస్లో అత్యధికంగా ఒకే బౌలర్ చేతిలో కుక్ అవుట్ కావడం ఇదే తొలిసారి. అయితే ఈ సిరీస్లో జడేజా బౌలింగ్ వేసే క్రమంలో కుక్ యావరేజ్ 12.50 గా నమోదైంది.   నాల్గో టెస్టులో రెండు సార్లు జడేజాకు చిక్కిన కుక్.. ఐదో టెస్టులో రెండు సార్లూ జడేజా బౌలింగ్ లోనే అవుటయ్యాడు. అంతకుముందు మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో జడేజా బౌలింగ్ లో కుక్ అవుట్ కాగా, తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో జడేజా బౌలింగ్ లో కుక్ పెవిలియన్ చేరాడు.


ఈ రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే జడేజా చేతికి కోహ్లి బంతి ఇచ్చాడు. ఉదయం సెషన్లో 19.0 ఓవర్ తరువాత జడేజా చేతికి కోహ్లి బంతి ఇచ్చాడు. ఈ తన ప్రయోగంలో కోహ్లి మరోసారి సఫలమయ్యాడు. జడేజా వేసిని 39.0 ఓవర్ నాల్గో బంతికి కుక్ అవుటయ్యాడు. ఆ తరువాత జెన్నింగ్స్(54) ను కూడా జడేజా పెవిలియన్ కు పంపాడు. దాంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది.

>
మరిన్ని వార్తలు