‘అతన్ని తుది జట్టులోకి తీసుకోండి’

29 Jun, 2019 16:39 IST|Sakshi

భారత క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌కు డీన్‌ జోన్స్‌ సూచన

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నప్పటికీ మిడిల్‌ ఆర్డర్‌లో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రధానంగా భారత్‌ జట్టు ఎంతోకాలంగా అన్వేషిస్తున్న నాల్గో స్థానంపై ఇంకా డైలమా కొనసాగుతూనే . ఈ మెగా టోర్నీలో నాల్గో స్థానంలో ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను దింపిన ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నాల్గో స్థానంలో భారత్‌ను కలవరపెడుతోంది. నాల్గో స్థానంలో  వచ్చిన ఆటగాడు కీలక ఇన్నింగ్స్‌ ఆడితేనే భారీ స్కోరు చేయడానికి ఆస్కారం ఉంటుంది.

దీనిపై భారత్‌ మేనేజ్‌మెంట్‌ ఇంకా తర్జన భర్జనలు పడుతూనే ఉంది. కాగా, నాల్గో స్థానంలో ఎంఎస్‌ ధోనినే కరెక్ట్‌ అంటున్నాడు ఆసీస్‌ మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌. ‘ ఇక్కడ వేరే ఆలోచనే లేదు. భారత్‌ జట్టు నాల్గో స్థానంలో ధోనినే దింపడమే సరైనది. నాల్గో స్థానంలో విజయ్‌ శంకర్‌ వద్దు. నాల్గో స్థానంలో ధోనిని దింపితే ఎటువంటి ఇబ్బందుల ఉండవు’ అని డీన్‌ జోన్స్‌ పేర్కొన్నాడు. అదే సమయంలో భారత తుది జట్టులో ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాను తీసుకోవాలంటూ సూచించాడు. జడేజాను తుది జట్టులో ఎంపిక చేస్తే అటు భారత బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌ కూడా బలోపేతం అవుతుందన్నాడు. దినేశ్‌ కార్తీక్‌ విషయంలో కూడా భారత మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తే బాగుంటుందన్నాడు. దినేశ్‌ కార్తీక్‌ నాల్గో స్థానానికి సరిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అతని ఎంపికపై కూడా దృష్టి సారిస్తే మంచిదన్నాడు. అయితే విన్నింగ్‌ కాంబినేషన్‌ను మార్చడానికి ఎవరూ కూడా సాహసం చేయరనే విషయం తనకు తెలుసన్నాడు.


 

>
మరిన్ని వార్తలు