చాహల్, పంత్‌ ఔట్‌

29 Oct, 2018 13:24 IST|Sakshi

ముంబై: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ బ్రాబౌర్న్‌ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న నాల్గో వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యం సాధించాలనే యోచనలో ఉంది. అదే సమయంలో మూడో వన్డేలో గెలిచిన వెస్టిండీస్‌ మంచి జోరు మీద ఉంది. నాల్గో వన్డేలో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది.  యజ్వేంద్ర చాహల్‌, రిషబ్‌ పంత్‌లకు విశ్రాంతి నిచ్చిన టీమిండియా యాజమాన‍్యం.. రవీంద్ర జడేజా, కేదర్‌ జాదవ్‌లను తుది జట్టులోకి తీసుకుంది.


గత వన్డేలో రోహిత్, ధావన్‌ విఫలం కావడం... మిడిల్, లోయర్‌ ఆర్డర్‌లలో ఎవరూ కోహ్లికి అండగా నిలవకపోవడంతో భారత్‌  పరాజయం పాలైంది. నాలుగో స్థానం కోసం ఇప్పటికే కోహ్లి విశ్వాసం పొందిన అంబటి రాయుడు నిలకడగా రాణించడం ఎంతో అవసరం. ఇక ఐదు, ఆరు స్థానాలు కూడా చాలా కీలకం. కాగా, ఇప్పటికే టి20ల్లో చోటు కోల్పోయిన ధోని తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అతను ధనాధన్‌ షాట్లు ఆడి చాలా కాలం కాగా... వన్డే శైలికి తగినట్లుగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ కీలక పరుగులు సాధించాల్సి ఉంది. జాదవ్‌, జడేజాల రాకతో భారత్‌ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ మెరుగ్గా కనబడుతోంది.

తుది జట్లు

భారత్‌; విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని, కేదర్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, జస్ప్రిత్‌ బూమ్రా

వెస్టిండీస్‌; జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), కీరన్‌ పావెల్‌, హెమ్రాజ్‌, సాయ్‌ హోప్‌, మార్లోన్‌ శ్యామ్యూల్స్‌, హెట్‌మెయిర్‌, రోవ్‌మాన్‌ పావెల్‌, పాబియన్‌ అలెన్‌, ఆశ్లే నర్స్‌, రోచ్‌, కీమో పాల్‌ 

కేదర్‌ జాదవ్‌ విమర్శలు; దిగివచ్చిన బీసీసీఐ

మరిన్ని వార్తలు