ఓవరాల్ చాంప్స్ ప్రవీణ్, జాహ్నవి

18 Oct, 2016 10:32 IST|Sakshi

హైదరాబాద్: వన్డే ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ప్రవీణ్, శ్రీలలిత జాహ్నవి సత్తాచాటారు. బేగంపేట్‌లోని ఎయిర్‌లైన్స్ కాలనీలో సోమవారం జరిగిన ఈ టోర్నీలో అండర్-15 విభాగంలో ప్రవీణ్, అండర్- 9 విభాగంలో జాహ్నవి ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో అండర్-7, 9, 11, 13, 15 విభాగాల్లో జరిగిన ఈ టోర్నీలో దాదాపు 80 మంది చిన్నారులు పాల్గొన్నారు. పోటీల అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ మాస్టర్ పీడీఎస్ గిరిధర్, టీఎస్‌సీఏ కార్యదర్శి ఎ. వెంకటేశ్వర రావు చిన్నారులకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు
 అండర్-7 బాలురు: 1. సంకేత్ రెడ్డి, 2. కె. సుశాంత్.
 బాలికలు: 1. శ్రీలలిత జాహ్నవి, 2. ప్రణీత ప్రియ.
 అండర్-9 బాలురు: 1. గణేశ్ సారుు, 2. రోహిత్.
 బాలికలు: 1. శ్రీశాంతి, 2. అక్షర.
 అండర్-11 బాలురు: 1. అభిరామ్, 2. గాంధీ.
 బాలికలు: 1. యజ్ఞ ప్రియ, 2. శృతిక.
 అండర్-13 బాలురు: 1. ప్రవీణ్, 2. నమన్.
 బాలికలు: 1. శ్రీచందన, 2. సాయి అఖిల.
 అండర్-15 బాలురు: 1. అత్యుత్, 2. కృష్ణ దేవర్ష్.
 బాలికలు: 1. సాయి ప్రియ, 2. రోలీ.

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా