అండర్సన్‌ గూబ గుయ్యిమంది

6 Aug, 2018 14:24 IST|Sakshi

ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సరదాగా గోల్ఫ్‌ ఆడబోతే గూబ గుయ్యిమంది. సహచరుడు స్టువర్ట్‌ బ్రాడ్‌ అందుకు సంబంధించిన ‘హిల్లేరియస్‌’ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. పలువురు సరదా కామెంట్లు చేస్తున్నారు. విషయం ఏంటంటే... భారత్‌తో తొలి టెస్ట్‌ విజయం తర్వాత ఈ ఇద్దరు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బకింగ్‌హమ్‌షైర్‌లోని ఓ గోల్ఫ్‌ కోర్సుకు వెళ్లారు. అక్కడ అండర్సన్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా.. బ్రాడ్‌ వెనకాల నుంచి వీడియో తీశాడు.

గోల్ఫ్‌ స్టిక్‌తో బంతిని బలంగా కొట్టగా.. కింద ఉన్న ఓ చెక్క ముక్క తగిలి బంతి తిరిగి అండర్సన్‌ ముఖానికి బలంగా తాకింది. దెబ్బ బలంగానే తాకటంతో ఆ బాధతో అండర్సన్‌ విలవిలలాడుతూ పక్కకు జరిగిపోయాడు. ఈ తతంగాన్ని బ్రాడ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా.. అది కాస్త వైరల్‌ అవుతోంది. ఇంతకీ దాదాపు ప్రతీ ఒక్కరూ అడిగే ఒకేఒ‍క్క ప్రశ్న. ‘అండర్సన్‌ పళ్లు ఊడలేదు కదా?’ అనే... అయితే జిమ్మీ(అండర్సన్‌)కు చిన్న గాయం కూడా కాలేదని, ఫర్‌ఫెక్ట్లీ ఫైన్‌ అంటూ తర్వాత బ్రాడ్‌ స్పష్టం చేసేశాడు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీమిండియా పట్టు చేజారినట్లేనా?

కష్టాల్లో టీమిండియా

ధోని రికార్డును బ్రేక్‌ చేసిన పంత్‌

ఆదిలోనే టీమిండియా తడ‘బ్యాటు’

టీమిండియా లక్ష్యం 287

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంతరిక్షానికి చిట్టిబాబు

ప్రభాస్‌ ‘సాహో’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సినిమాలో రాణి మిస్సయింది.. కానీ

త్రినేత్ర మళ్లీ వచ్చేస్తున్నాడు..

బిల్డర్‌తో వివాదం.. ప్రధాని సాయం కోరిన నటి

అక్షయ్‌ ఖన్నా తల్లి గీతాంజలి మృతి